ఏబీజీ షిప్‌యార్డ్ స్కాం: భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ కుంభకోణం ఇదేనా?

వీడియో క్యాప్షన్, భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ కుంభకోణం ఇదేనా?

దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్కామ్‌గా చెబుతున్న ఏబీజీ షిప్‌యార్డ్ కంపెనీ చేసిన అవినీతి విలువ సుమారు రూ.23 వేల కోట్లు.

గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ అనే కంపెనీ 2012 నుంచి 2017 మధ్య సుమారు 28 బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసం చేసినట్లు ఇటీవలే కేసు పెట్టింది సీబీఐ.

ఇది ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారుతోంది.

కంపెనీ మోసానికి పాల్పడినట్లు నాలుగైదేళ్ల కిందటే తెలిసినా ఇంత ఆలస్యంగా ఎందుకు కేసు ఫైల్ చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శిస్తోంటే అసలు ఆ కంపెనీ చేసిన మోసమంతా కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని ఆరోపిస్తోంది బీజేపీ.

అసలు ఈ స్కాం ఎలా బయటపడింది. అధికారులు ఈ కంపెనీ మోసాల చిట్టాను ఎలా విప్పారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)