కొడాలి నాని: ఆ నాలుగు మీడియా సంస్థలను వైసీపీ నిషేధిస్తోందన్న మంత్రి

వీడియో క్యాప్షన్, ఆ నాలుగు మీడియా సంస్థలను వైసీపీ నిషేధిస్తోందని వెల్లడించిన మంత్రి కొడాలి నాని

ప్రభుత్వానికి, తమ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయంటూ, ఆ నాలుగు పత్రికా సంస్థలను వైసీపీ నిషేధిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని ప్రకటించారు.

ప్రభుత్వానికి, తమ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నాయంటూ ఈటీవీ, ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై కొద్ది రోజులుగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సహా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఈ రోజు ఏపీ మంత్రి కొడాలి నాని ఆ నాలుగు మీడియా సంస్థలను వైసీపీ నిషేధిస్తోందని వెల్లడించారు. తమ పార్టీ నేతలెవరూ ఆ మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడొద్దని, ప్రెస్ మీట్లకు వారిని పిలవొద్దని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)