వైఎస్ జగన్: ‘మూడు రాజధానులపై ముందుకే.. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం’

వీడియో క్యాప్షన్, వైఎస్ జగన్: ‘మూడు రాజధానులపై ముందుకే.. వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం’

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని జగన్ చెప్పారు.

అయితే, వికేంద్రీకరణ గురించి అనేక అపోహలు, అనుమానాలు, దుష్ప్రచారాలు, న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు.. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి దుష్ప్రచారం చేశారన్నారు.

ఈ నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, బిల్లుల్ని మరింత మెరుగు పర్చేందుకు, అన్ని ప్రాంతాలకూ, అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇకేమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపర్చేందుకు ఇంతకు ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని వెనక్కు తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో ప్రభుత్వం సభ ముందుకు వస్తుందన్నారు.

విస్తృత, విశాల, ప్రజాప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని జగన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)