కరోనాతో కోమాలో ఉండగానే కవల పిల్లలు పుట్టారు

వీడియో క్యాప్షన్, కరోనాతో కోమాలో ఉండగానే కవల పిల్లలు పుట్టారు

2021 జనవరిలో సుల్తానాకు కోవిడ్-19 సోకింది. అప్పటికే ఆమె 31 వారాల గర్భవతి. గర్భిణి కాబట్టి ఆమె వ్యాక్సీన్ వేయించుకునే వీలులేదు.

34 ఏళ్ల సుల్తానా ఇంగ్లండ్‌లోని ల్యూటన్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వెంటనే సిజేరియన్ చేయాలని డాక్టర్లు చెప్పారు.

ఆ క్రమంలోనే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఆమెకు కవల పిల్లలు పుట్టారు.

పిల్లలు పుట్టిన సంగతి కూడా ఆమెకు తెలియలేదు.

41 రోజుల తర్వాత కోమా నుంచి ఆమె బయటకు వచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)