ఆరని చితి మంటలు: దేశంలోని పరిస్థితికి నిదర్శనం ఈ చిత్రాలు..

భారత్‌తో కోవిడ్ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఐసీయూ బెడ్లు, మందులు, ఆక్సిజన్ లేక ఎంతో మంది రోగులు చనిపోతున్నారు.

భారత్‌లో ఇప్పటికే లక్షా 86వేల మంది కోవిడ్‌తో చనిపోయారు.

గడిచిన రెండు వారాల్లోనే దాదాపు 30 లక్షల మందికి కరోనా సోకింది.

రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.

భారత్‌లో మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.

ఫలితంగా శ్మశానవాటికల్లో చితి మంటలు ఆరడం లేదు.

దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కాష్టం కాలుతూనే ఉంది.

అంత్యక్రియల కోసం రోగుల బంధువులు శ్మశానవాటికల దగ్గర గంటల కొద్ది ఎదురుచూస్తున్నారు.

కొన్ని నగరాల్లో స్థలం లేకపోవడంతో సామూహిక అంత్యక్రియలు చేపడుతున్నారు.

పలు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న కోవిడ్ మృతుల సంఖ్యపై అనేక మంది జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని నగరాల్లో కోవిడ్ మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే పదిరెట్లు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సూరత్‌లోని ఒక శ్మశానవాటిక నిరంతరం మండుతూనే ఉండటంతో అక్కడున్న చిమ్మీ కొద్దిగా కరిగిపోయింది.