You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాహుల్ గాంధీ: ‘నన్ను టచ్ కూడా చేయలేరు.. నేనెవరికీ భయపడను’
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు.
ఆయన వ్యవసాయ చట్టాల నుంచి మోదీ ప్రభుత్వం, చైనా విధానం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వరకూ అనేక అంశాలపై మాట్లాడారు.
రైతులపై తనకు సానుభూతి ఉందని మరోసారి చెప్పిన రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగం ముగ్గురు నలుగురు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నారు.
"కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల చేతులకు అప్పగించింది" అని అన్నారు.
అదే సమయంలో రాహుల్ గాంధీ 'ఖేతీకా ఖూన్'(వ్యసాయం రక్తం) అనే పేరుతో ఒక బుక్‌లెట్ కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తాను ఎవరికీ భయపడ్డం లేదని చెప్పారు. తనను కాల్చి చంపవచ్చుగానీ, తాకలేరని అన్నారు.
‘రైతులను బోల్తా కొట్టించలేరు.. వారు ప్రధాని కంటే తెలివైనవారు’
రైతులకు మద్దతు ప్రకటించిన ఆయన "ఈరోజు రైతులు తమ కోసమే పోరాటం చేయడం లేదు. అందరికోసం చేస్తున్నారు. అందుకే అందరూ రైతులకు అండగా నిలబడాలి" అన్నారు.
ముఖ్యంగా యువత రైతులకు అండగా నిలబడాలని రాహుల్ గాంధీ అప్పీల్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు."రైతులు అలసిపోయేలా చేయచ్చవని, వారిని బోల్తా కొట్టించవచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ, రైతులు ప్రధానమంత్రి కంటే తెలివైనవారు. దీనికి పరిష్కారం ఒకటే. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకోవాలి" అన్నారు.
అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నడ్డా ప్రతి విమర్శకూ ఒక్కొక్కటిగా సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- యశ్వంత్ మనోహర్: సరస్వతి దేవి చిత్రం వేదికపై ఉందని అవార్డు తిరస్కరించిన కవి
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏంటి గొడవ? ఆ అడ్డుగోడలు కూలేదెలా?
- విరాట్ కోహ్లీ వీడియోపై విమర్శల వెల్లువ... ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్
- ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక తమిళుడిపై తమిళుల ఆగ్రహం ఎందుకు? ఆయన బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)