వరద ఉద్ధృతి పెరగడంతో వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు

వీడియో క్యాప్షన్, Cyclone Nivar: వరద ఉద్ధృతి పెరగడంతో వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు

నివర్ తుపాను ప్రభావంతో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు పట్టణంలో రోడ్లు జలమయం అయ్యాయి. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వరదయ్యపాలెంలో అరుణా నది, పాముల కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సంతావేలూరు, వరదయ్యపాలెం మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)