కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది... కానీ, మాకు సోకలేదు

వీడియో క్యాప్షన్, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మాకు సోకలేదు..

ప్రపంచంలో అత్యంత జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతం ఒకటి. ఇక్కడెన్నో మూల వాసీ తెగలు ఉంటాయి. ఈ ప్రాంతాలకు పడవల ద్వారానే చేరుకోగలం.

కానీ, ఇక్కడి ప్రజలు కూడా కరోనావైరస్ బారిన పడకుండా ఉండలేకపోయారు. పెరూ సమీపంలోని ఓ గ్రామంలో దాదాపు 90 శాతం మందికి కరోనా సోకింది. చాలా మంది చనిపోయారు.

106 సంవత్సరాలు బతికిన ఓ మహిళ కోవిడ్ సోకడంతో చనిపోయారు. అయితే, బ్రెజిల్-పెరూ సరిహద్దు ప్రాంతంలోని కొన్ని తెగల ఆవాసాలు మాత్రం కరోనాను దరి చేరనీయలేదు. 'మా ఊరిలో ఆ మహమ్మారి లేదు' అని వారు ధైర్యంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)