అమర్‌నాథ్: హిందువుల యాత్రకు ముస్లింల సాయం

వీడియో క్యాప్షన్, రెండేళ్లుగా అమర్‌నాథ్ యాత్ర రద్దు

అమర్‌నాథ్ యాత్రను ఈ ఏడాది రద్దు చేయాలని ఆ ఆలయ బోర్డు నిర్ణయించింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత ఏడాది కూడా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో.. అమరనాథ్ యాత్ర రద్దయ్యింది.

టా యాత్రికులకు ఆహ్వానం పలికే కశ్మీరీల్లో ఈసారి ఆందోళన వ్యక్తమైంది. కోవిడ్-19 హాట్‌స్పాట్‌లలో జమ్మూకశ్మీర్ కూడా ఒకటి కావడమే దానికి కారణం. ఇక్కడ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

మరోవైపు ఈ సారి యాత్రికులపై సాయుధులు దాడిచేసే ముప్పుందని భారత సైన్యం కూడా హెచ్చరించింది.

అయితే రోజువారి దర్శనాలను 500కు పరిమితం చేస్తూ యాత్రకు అనుమతించాలని జమ్మకశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం కొత్త ప్రొటోకాల్ తీసుకొచ్చారు. కేవలం రెండు వారాలు మాత్రమే యాత్రికులను అనుమతించాలని ఆయన సూచించారు. కానీ, ఇప్పుడు మొత్తంగా యాత్ర రద్దయింది.

అయితే, అమర్‌నాథ్ యాత్రలో హిందువులకు ముస్లింల నుంచి సాయం అందుతుంటుంది.. అదెలాగో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)