పానీ పూరీ ఏటీఎం: భారతీయుడి ఆవిష్క‌ర‌ణ‌.. ఇలా డబ్బులు వేస్తే.. అలా పానీపూరీ

వీడియో క్యాప్షన్, పానీ పూరీ ఏటీఎం: భారతీయుడి ఆవిష్క‌ర‌ణ‌.. ఇలా డబ్బులు వేస్తే.. అలా పానీపూరీ

గుజరాత్‌లోని బనాస్‌కాంటాకు చెందిన భరత్ ప్రజాపతి పానీపూరీలు విక్రయించడానికి ఒక యంత్రాన్ని తయారుచేశారు.

ఈ మెషిన్‌లో డబ్బులు వేస్తే అందులోంచి పానీపూరీలు వస్తాయి.

మూడు ఫ్లేవర్లలో పానీపూరీలు దీన్నుంచి పొందొచ్చు.

ముందుగానే పానీపూరీలు, అందులో నింపే నీళ్లు అన్నీ ముందుగానే ఆ యంత్రంలో ఉంచుతారు.

డబ్బులు వేసి స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్స్ నొక్కి పానీపూరీలు తీసుకోవచ్చు.

భరత్ దీన్ని తన సొంత ఆలోచనతో ఆరు నెలలు శ్రమించి తయారుచేశారు.

ఇది అచ్చంగా ఒక ఏటీఎంలా పనిచేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)