You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి తీరాలి: ఉత్తరాఖండ్ హైకోర్టు
ఉత్తరాఖండ్‌లోనే ఉండదలచుకున్న వలస కార్మికులకు సాధ్యమైన సదుపాయాలన్నీ కల్పించి తీరాలని, తమ స్వరాష్ట్రాలకు వెళ్లదలచుకున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించటానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించి తీరాలని ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం ఆదేశాల్లో స్పష్టంచేసింది.
జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో జస్టిస్ రవీంద్ర మైథానితో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. సచ్చిదానంద్ దాబ్రాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు రెండు లక్షల మంది వలస కూలీలు ఉన్నారని ఓ అంచనా అని ఉత్తరాఖండ్ హైకోర్టు పేర్కొంది.
అలాగే, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రాదలచుకున్న వలస కూలీలు, అనుమతి ఇస్తున్న ఇతరుల్లో ప్రతి ఒక్కరికీ కేవలం థర్మల్ స్క్రీనింగ్ సరిపోదని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అనేది తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది.
యాంటీజెన్ పరీక్షలు కానీ ఇతర రాపిడ్ పరీక్షలు కానీ నిర్వహిస్తున్నారా లేదా అనేది స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, అడ్వొకేట్ జనరల్‌కు చెప్పింది.
రాష్ట్రంలోని ఉత్తర కాశి, అల్మోరా వంటి మారుమూల జిల్లాలకు కూడా కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తులు చేరుకున్నారన్న సమాచారం తమకు ఉన్నందువల్ల ఈ వివరాలు కోరుతున్నట్లు పేర్కొంది.
పారా లీగల్ వలంటీర్ల ద్వారా పునరావాస కేంద్రాల నిర్వహణకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వంలోని జిల్లా న్యాయసేవ అధికారులకు ధర్మాసనం నిర్దేశించింది.
హైకోర్టు ఈ పిటిషన్ మీద మే 15న మళ్లీ తదుపరి చేపడుతుంది.
ఇవి కూడా చదవండి.
- విశాఖపట్నం గ్యాస్ లీకేజి: ‘‘నాకు పరిహారం వద్దు.. నాకు నా ఇద్దరు పిల్లల్ని, నా భర్తను ఇవ్వండి’’
- వైజాగ్ గ్యాస్ లీక్: ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? దర్యాప్తు నివేదిక ఎప్పుడు వస్తుంది?
- కరోనావైరస్: ‘ఈ సంక్షోభంలో ఖండాలు దాటుతూ చేసిన ప్రయాణాలు నాకు ఏం నేర్పాయంటే...’ - బ్లాగ్
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదా?
- కరోనావైరస్ రోగులకు చికిత్స అందించే ఓ నర్సు, ఆమె కుమారుడు.. ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)