ఆంధ్రప్రదేశ్‌: కరోనా లాక్‌డౌన్‌తో సరిహద్దులు మూసేస్తున్న గ్రామాలు

కరోనావైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రజలు తమ గ్రామ సరిహద్దుల్ని మూసేస్తున్నారు.

విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారంలో గ్రామం నలుమూలలు దిగ్బంధనం చేసిన గ్రామ యువకులు, వాలంటీర్లు తమ గ్రామంలోనికి ఇతర గ్రామాలకు చెందిన వారెవరూ రాకుండా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.

చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను భారతదేశంలో మంగళవారం అర్థరాత్రి నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తన సరిహద్దుల్ని మూసివేసింది.

పలు జిల్లాలు కూడా సరిహద్దుల్ని మూసివేస్తున్నాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)