You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA - NRC: చెన్నైలో ముగ్గులతో నిరసనలు.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు ఏడుగురిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. గంటన్నర తర్వాత వారిని విడుదల చేసినట్లు పేర్కొంది.
సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముగ్గులు వేసిన గాయత్రి, ఆర్తి, కల్యాణి, ప్రగతి, మదన్‌లతోపాటు వారికి సహకరించిన మరో ఇద్దరు న్యాయవాదులను ఇలా అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
బీసెంట్ నగర్‌లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో వాళ్లు ఈ ముగ్గులు వేశారు. 'సీఏఏ వద్దు.. ఎన్ఆర్‌సీ వద్దు' అంటూ వాటిలో నినాదాలు రాశారు.
నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని డీఎంకే నాయకుడు ఎమ్‌కే స్టాలిన్ ఖండించారు.
''ఏడీఎంకే ప్రభుత్వ అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు వారిని అరెస్టు చేశారు. నిరసన తెలిపే హక్కును కూడా వారికి ఇవ్వడం లేదు'' అంటూ ట్వీట్ చేశారు.
సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిని నియంత్రించేందుకు తమకు అధికారాలున్నాయని.. చిన్న, చిన్న జన సమూహాలు పెద్ద గుంపులుగా పెరిగి శాంతి భద్రతల సమస్యకు దారితీయొచ్చని ఓ పోలీసు అధికారి అన్నారు. నిరసనలు అదుపు తప్పకముందే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
గత వారం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నిరసనలకు మద్దతుగా చెన్నైలో చాలా మంది సామాజిక కార్యకర్తలు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు కలిసి ఓ సంగీత కార్యక్రమం కూడా నిర్వహించారు. పోలీసుల ఆంక్షల మధ్యే ఈ కార్యక్రమం జరిగింది.
సీఏఏకు వ్యతిరేకంగా చెన్నైలో ఓ పెద్ద ర్యాలీ కూడా జరిగింది. 650 అడుగుల పొడవైన జెండాను ఈ ర్యాలీలో ప్రదర్శించారు.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ చట్టం: ‘వాస్తవాలకు అతీతంగా వ్యతిరేకతలు.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న మేధావులు’ - అభిప్రాయం
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్లో ఎందుకు కొనసాగుతోంది
- CAA నిరసనలు: "పశువులకు గడ్డికోసం వెళ్లిన మా అబ్బాయిని పోలీసులు చంపేశారు" - గ్రౌండ్ రిపోర్ట్
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు... ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- ప్రియాంకా గాంధీ: 'ఉత్తర్ప్రదేశ్ పోలీసులు నా గొంతు పట్టుకున్నారు.. నాతో గొడవపడ్డారు'
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- CAA-NRC: ‘మేము 'బై చాన్స్' ఇండియన్స్ కాదు, 'బై చాయిస్’ ఇండియన్స్’ - మౌలానా మహమూద్ మదనీ
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఆ 19 లక్షల మందిని దేశం నుంచి ఎలా తరలిస్తారు.. రైళ్లలోనా, విమానాల్లోనా?: చిదంబరం - #బీబీసీ ఇంటర్వ్యూ
- శాండా బల్లి: మనుషుల 'మగతనం' కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఎడారి జీవి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)