You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రియాంకా గాంధీ: 'ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నా గొంతు పట్టుకున్నారు.. నాతో గొడవపడ్డారు'
లఖ్‌నవూలో మహిళా పోలీసులు తన గొంతు పట్టుకున్నారని, తనతో గొడవపడ్డారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకతల సమయంలో అరెస్టు చేసిన రిటైర్డ్ పోలీస్ అధికారి ఇంటికి వెళ్తున్నప్పుడు తనను ఆపేందుకు ప్రయత్నించారని, అదే సమయంలో ఇదంతా జరిగిందని ఆమె చెప్పారు.
దీనికి సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారి ఎస్.ఆర్. దారాపురీ ఇంటికి వెళ్లడానికి ప్రియాంకాగాంధీ మొదట ఒక స్కూటర్ వెనుక కూర్చున్నారు. తర్వాత నడిచివెళ్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు చేసినందుకు ఎస్.ఆర్. దారాపురీని ఇదే వారం అరెస్టు చేశారు.
ప్రియాంక తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. అందులో ఆమె నడిచి వెళ్తున్నారు. ఆమెతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.
ఈ వీడియోతోపాటు "ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఇలా చేస్తారేంటి? ఇలా అందరి రాకపోకలను అడ్డుకుంటున్నారు. నేను రిటైర్డ్ పోలీస్ అధికారి, అంబేడ్కర్‌వాది, సామాజిక కార్యకర్త ఎస్.ఆర్.దారాపురి ఇంటికి వెళ్తున్నాను. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఆయన్ను ఎన్ఆర్సీ, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా శాంతిపూర్వక నిరసనలు చేసినందుకు ఇంటి నుంచి తీసుకెళ్లారు" అని ఆమె రాశారు.
"నన్ను బలవంతంగా అడ్డుకున్నారు. మహిళా అధికారి నా గొంతు పట్టుకుని లాగారు. కానీ నేను గట్టిగా నిలబడ్డాను. నేను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల దౌర్జన్యానికి బలవుతున్న ప్రతి పౌరుడికీ అండగా నిలుస్తున్నాను" అని కూడా ప్రియాంక చెప్పారు.
"బీజేపీ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోంది. నేను ఉత్తర్‌ప్రదేశ్ ఇంచార్జిని. నేను ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడికెళ్లాలి అనేది ఈ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించదు" అని కూడా ఆమె పేర్కొన్నారు.
కాన్వాయ్‌ను అడ్డుకున్నారు - ప్రియాంక
"నేను దారాపురి కుటుంబాన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు యూపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. వాళ్లు నా గొంతు పట్టుకున్నారు. నాతో గొడవపడ్డారు. నేను పార్టీ కార్యకర్త టు-వీలర్‌పై కూర్చుని వెళ్తున్నప్పుడు, వాళ్లు నన్ను చుట్టుముట్టారు. ఆ తర్వాత నేను నడిచి అక్కడికి చేరుకున్నాను" అని ప్రియాంక గాంధీ చెప్పారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
అంతకుముందు తన కాన్వాయ్ దారాపురి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు తనను అడ్డుకున్నారని ఆమె చెప్పారు.
"వాళ్లు నన్ను రోడ్డు మధ్యలో ఆపేశారు. వారి దగ్గర నన్ను ఆపడానికి ఎలాంటి కారణం లేదు. వాళ్లలా ఎందుకు చేశారో దేవుడికే తెలియాలి" అని ప్రియాంకా గాంధీ అన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్‌కు ఒక కోడ్ పంపించారు.. భారీ మొత్తంలో నగదు బహుమతి కొట్టేశారు..
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- పౌరసత్వ చట్టం: ‘వాస్తవాలకు అతీతంగా వ్యతిరేకతలు.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న మేధావులు’ - అభిప్రాయం
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: దిల్లీ పోలీసుల లాఠీల నుంచి స్నేహితుడికి రక్షణ కవచంగా మారిన యువతులు
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- బండి నారాయణస్వామి 'శప్తభూమి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- Fake news: దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- గూఢచర్యం ఆరోపణలపై విశాఖలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్ట్
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)