You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్: గూఢచర్యం ఆరోపణలపై విశాఖలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్ట్
విశాఖపట్నంలో ఏడుగురు నౌకాదళ సిబ్బందిని గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు చేశారు. పాకిస్తాన్‌తో వీరికి సంబంధాలున్నాయనే ఆరోపణలతోనే వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
నావికాదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు.
"ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, నేవల్ ఇంటెలిజెన్స్‌లు కలిసి పాకిస్తాన్‌తో సంబంధాలున్న ఓ గూఢచర్య రాకెట్‌ను బట్టబయలు చేశారు. నేవీకి చెందిన ఏడుగురు ఉద్యోగులతో పాటు, ఓ హవాలా ఆపరేటర్‌ను కూడా అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరికొంతమంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. విచారణ జరుగుతోంది" అని 'ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్' పేరుతో విడుదల చేసిన ఓ ప్రకటనలో ఏపీ డీజీపీ కార్యాలయం పేర్కొంది.
వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు అని ఆ ప్రకటనలో తెలిపారు.
తూర్పునౌకాదళానికి కీలకమైన డాల్ఫిన్స్ నోస్ కేంద్రంగా గూఢచర్యం రాకెట్ వీరు నడుపుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
అరెస్టైన ఏడుగురినీ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి జనవరి 3 వరకూ రిమాండ్ విధించింది.
తూర్పు నావికాదళ కమాండ్ అయిన విశాఖపట్నం కేంద్రంగా గూఢచర్యం జరుగుతున్నట్లుగా గుర్తించిన నిఘా సంస్థలు ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ అని పేరు పెట్టాయి. అరెస్టైన వారు గతంలో విశాఖ కేంద్రంగా పనిచేశారని తెలుస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉండటం వల్ల కేసు విచారణ పూర్తయ్యే వరకూ వివరాలు వెల్లడించలేమని అధికారులు తెలిపారు. ఈస్ర్టన్ నేవీ కమాండ్ పీఆర్వోను ఈ విషయంపై సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి.
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- Indian Sports Woman Of The Year అవార్డును ప్రారంభించిన బీబీసీ న్యూస్ ఇండియా
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- 'హైదరాబాద్ ఎన్కౌంటర్' బూటకం, పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీం కోర్టులో నిందితుల కుటుంబ సభ్యుల పిటిషన్
- ర్యాలీలో పాల్గొనకుండా హెచ్‌సీయూ విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
- నుదిటిపై గాటు సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)