గిద్దా: మగవాళ్లే ఆడవాళ్ల వేషంలో చేసే డ్యాన్స్ ఇది

వీడియో క్యాప్షన్, గిద్దా: మగవాళ్లే ఆడవాళ్ల వేషంలో వేసే డ్యాన్స్ ఇది

పంజాబ్‌లో మహిళలు ప్రదర్శించే ఓ జానపద నృత్యం పేరు 'గిద్దా'. కానీ, ఇప్పుడు అక్కడ కొందరు మగవాళ్లు కూడా ఆడవాళ్లలా వేషం వేసుకొని ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ డ్యాన్స్ వల్ల తమ జీవితమే మారిపోయందంటున్నారు.

అలాంటివాళ్లలో నూర్ అనే టీచర్ కూడా ఒకరు. ఆయన వృత్తి పిల్లలకు పాఠాలు చెప్పడమే అయినా, 'గిద్దా' నృత్యమంటే తనకు ప్రాణమని ఆయన చెబుతున్నారు.

'సుమారు 20 ఏళ్లుగా నేనీ నృత్యం చేస్తున్నాను. నా బృందంలో అంతా మగవాళ్లే ఉన్నారు. కొందరు మమ్మల్ని హిజ్రాలు అనుకుంటారు. మరికొందరు మగవాళ్లే ఆడవాళ్లలా దుస్తులు వేసుకున్నారని గుర్తిస్తారు. ఏదేమైనా.. మా నృత్యానికి ఎంతోమంది ముగ్ధులవుతారు. మా డ్యాన్స్ వీడియోలు ఫేస్‌బుక్‌లో పెడుతున్నాం. ప్రజలు వాటిని లైక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రదర్శనల కోసం చాలామంది పిలుస్తున్నారు. ఈ నృత్య ప్రదర్శనలు మా మనసుకు హాయిగా ఉంటాయి' అంటున్నారు నూర్. మరి ఆయన డ్యాన్స్ ఎలా ఉంటుందో మీరూ పైనున్న వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)