You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర: ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు.
ఈ విషయాన్ని ఏఎన్ఐ వర్గాల సమాచారంతో ఏఎన్ఐ వెల్లడించింది.
రేపు ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌లతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.
బలనిరూపణకు గవర్నర్ వారికి 7 రోజుల గడువిచ్చారు.
దీనిపై ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వెంటనే బలనిరూపణకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి.
మహారాష్ట్ర రాజకీయ ఘటనాక్రమాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చెబుతూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీం కోర్టులో తమ వాదనలు వినిపించాయి. దీనిపై ఆదివారం ప్రారంభమైన విచారణ సోమవారం కూడా కొనసాగింది. అన్ని పార్టీల వాదనలు విన్న సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం తన ఆదేశాలను జారీచేసింది.
మరికాసేపట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
అసలేం జరిగింది?
మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తరువాత సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు.
ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనలు రెండింటికీ కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈలోగా అసెంబ్లీ గడువు పూర్తవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకొచ్చింది.
దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన ప్రయత్నాలు చేసింది.
ఆ ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాకముందే శనివారం ఉదయం ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఆ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు పలికారు. దీంతో ఆగమేఘాల మీద బీజేపీ, ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశాయి.
శనివారం ఉదయం దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వీరిని ఆహ్వానించడం, వారిచేత ప్రమాణ స్వీకారం చేయించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ఇవి కూడా చదవండి.
- మహారాష్ట్ర: ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రాజ్యాంగబద్ధంగానే జరిగిందా...
- అమ్మకానికి గున్న ఏనుగులు
- గర్భిణిని కరిచి చంపిన కుక్కలు.. 93 శునకాలకు డీఎన్ఏ పరీక్షలు
- ఆకలితో ఉన్న 500 మేకలు రొనాల్డ్ రీగన్ లైబ్రరీని కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నుంచి ఇలా కాపాడాయి..
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సంసిద్ధతపై 5 ప్రశ్నలు
- గూగుల్ పిక్సెల్ ఫోన్లలో భద్రతా లోపాన్ని చూపిస్తే భారీ బహుమతి
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాద సదస్సుపై ఆగ్రహం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)