వీడియో: హైదరాబాద్ బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
రిపోర్టర్: దీప్తి బత్తిని, బీబీసీ ప్రతినిధి
షూట్: ఎం. నవీన్ కుమార్, బీబీసీ కోసం
ప్రొడ్యూసర్, ఎడిట్: సంగీతం ప్రభాకర్, బీబీసీ ప్రతినిధి
''నేనూ అనాధగానే పెరిగిన. ఆ పెయిన్ ఎట్లా ఉంటదో నాకు ఎరుకే. కూలి నాలి చేసుకొని.. కష్టపడి.. అలాంటి బతుకు నా పిల్లలకు రావద్దని, నేను వాలందరినీ చదివిస్తున్న'' అని చెప్పారు లక్ష్మణ్.
లక్ష్మణ్, ఐదేళ్ల దివ్య తండ్రి. ఇటీవల హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ వద్ద ఒక ప్రభుత్వ పాఠశాల బయట ఒక గిన్నె పట్టుకొని క్లాస్‌రూమ్‌లోకి తొంగి చూస్తున్న ఫోటో 'ఆకలి చూపు' అనే కాప్షన్‌తో ఈనాడు దినపత్రిక టాబ్లాయిడ్‌లో ప్రచురితమవటంతో దివ్య కథనం ఆసక్తిగా మారింది. దివ్యని ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకున్నారు.
''వర్షాకాలం కావటంతో డెంగీ వంటి ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అని చూసేందుకు వెళ్ళాను. భోజనం సమయం కావటంతో ఒక పాప మధ్యాహ్న భోజనం కోసం ఒక గిన్నెతో బయట నిలబడి ఉండటం చూశాను. అక్టోబర్‌లో ఫొటో తీశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నం మిగిలితే తినే స్థితి నుంచి కలిసి కూర్చొని తినే స్థితికి వచ్చింది పాప" అని అంటున్నారు ఆ ఫొటో తీసిన ఫోటోగ్రాఫర్ ఆవుల శ్రీనివాస్.
ఆ ఫోటో చూసి సోషల్ మీడియాలో ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకట్‌రెడ్డి ఈ పాప బడికి ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించటంతో హుటాహుటిన అధికారులు దివ్యను అదే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్చుకున్నారు. నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి దివ్య స్కూల్‌కి వెళుతోంది.
''టీచర్లను కూడా సెన్సిటైజ్ చేయవలిసిన అవసరం ఉంది. ఆ బడి కేంద్రంగా అక్కడ నివసిస్తున్న వారికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టటం అవసరం'' అంటున్నారు వెంకట్ రెడ్డి.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య తీర్పుపై ఐదు ప్రశ్నలు
- 'అయోధ్య పీటముడిలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో చిక్కుకుపోయింది’
- కశ్మీర్, అయోధ్యల తరువాత... మోదీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏమిటి?
- శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం కేసులో సుప్రీం కోర్టు తాజా నిర్ణయం
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్ కన్సార్షియం
- విజయవాడలో స్విగ్గీ సర్వీస్ ఎందుకు ఆగిపోయింది...
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి?
- కిడ్నాపర్ల నుంచి ప్రయాణికులను కాపాడుతున్న రైలు కథ
- అక్కడ సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఏడు రెట్లు ఎక్కువ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)