సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష పదవిని చేపట్టడం దాదాపు ఖరారైందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిసింది.

భారత క్రికెట్ సంఘంలోని విశ్వసనీయ వ్యక్తి, "గంగూలీని బీసీసీఐకి కొత్తఅధ్యక్షుడిగా నిర్ణయించాం" అని ఏఎన్ఐతో చెప్పారు.

47 ఏళ్ళ సౌరవ్ గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా సీకే ఖన్నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే, బ్రజేశ్ పటేల్ ఐపీఎల్ చైర్మన్ పదవిని చేపట్టడానికి కూడా రంగం సిద్ధమైంది.

బీసీసీఐ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి అక్టోబర్ 14 చివరి తేదీ, ఎన్నికలు అక్టోబర్ 23న జరగాల్సి ఉఁది.

అక్టోబర్ 23న జరుగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) హాజరు కావడానికి దేశంలోని 38 రాష్ట్ర శాఖల్లో ఎనిమిదింటిపై అనర్హత వేటు పడిందని అక్చోబర్ 10న ప్రకటన వెలువడింది.

ఏజీఎం సమావేశంలో గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సిఏబీ)కి ప్రాతినిధ్యం వహిస్తాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మహమ్మద్ అజహరుద్దీన్, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసీఏ) తరఫున రజత్ శర్మ ఈ సమావేశానికి హాజరవుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)