You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండియా స్కోర్ 502.. దక్షిణాఫ్రికా 39/3.. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో వైజాగ్ టెస్ట్‌లో పట్టుబిగించిన భారత్
విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. అతడు తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచాడు.
మ్యాచ్ తొలి రోజు 84 పరుగులు సాధించిన మయాంక్ రెండో రోజైన గురువారం డబుల్ సెంచరీ చేశాడు. 358 బంతుల్లో అతడు డబుల్ సెంచరీ పూర్తిచేశాడు.
మయాంక్ 215 పరుగుల (371 బంతులు; 23 ఫోర్లు, ఆరు సిక్సర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద డీన్ ఎల్గర్ బౌలింగ్‌లో డేన్ పీట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ భారీ స్కోర్లతో దక్షిణాఫ్రికాపై భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 136 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగులు సాధించాక భారత్ డిక్లేర్ చేసింది.
ఇప్పటివరకు విశాఖపట్నం మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 455 పరుగులు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకొంది. వర్షం కారణంగా బుధవారం 59.1 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది.
తొలి రోజు సెంచరీ (115 పరుగులు) సాధించిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ రెండో రోజు 176 పరుగులకు వెనుదిరిగాడు.
రోహిత్ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
317 పరుగుల భాగస్వామ్యం
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఏకంగా 317 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ ఔట్ అయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా ఆరు పరుగులకే నిష్క్రమించాడు.
తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో 53 పరుగుల, అజింక్య రహానేతో 54 పరుగుల భాగస్వామ్యాలను మయాంక్ నమోదు చేశాడు.
కోహ్లీ 20, రహానే 15, హనుమ విహారి 10, వృద్ధిమాన్ సాహా 21 పరుగులు చేశారు.
రవీంద్ర జడేజా 30 పరుగులతో, రవిచంద్ర అశ్విన్ ఒక్క పరుగుతో నాటౌట్‌గా నిలిచారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఫిలాండర్, సెనురాన్ ముత్తుసామి, ఎల్గర్, డేన్ పీట్ తలా ఒకటి తీశారు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్: ఇంగ్లండ్‌లో భారత జట్టు విజయాలను చేజార్చుకోవడానికి నాలుగు కారణాలు
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- పాక్‌పై నిజాం వారసుల గెలుపు.. హైదరాబాద్ నుంచి పంపిన సొమ్ము నిజాం మనవళ్లదేనన్న బ్రిటన్ కోర్టు
- తమిళనాడులోని కీళడి తవ్వకాల్లో బయల్పడిన 2,600 ఏళ్ల నాటి పట్టణ నాగరికత
- గోదావరిలోంచి బోటు వెలికితీత: ముందుకు సాగని ఆపరేషన్
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?
- డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతే జరిమానా కట్టాల్సిన పని లేదు... ఇలా చేస్తే చాలు
- ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్: పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆ ఉత్పత్తుల జాబితా ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)