You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యోగి ఆదిత్యనాథ్‌పై ‘అభ్యంతరకరమైన’ ట్వీట్.. జర్నలిస్ట్, ఎడిటర్ అరెస్ట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో ‘అభ్యంతరకరమైన వ్యాఖ్య’ చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక విలేకరిని అరెస్ట్ చేశారు.
అరెస్టైన జర్నలిస్ట్ పేరు ప్రశాంత్ కనౌజియా. దిల్లీలో ఉన్న ప్రశాంత్‌ను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు లక్నో తీసుకెళ్లారు.
‘‘ఆయన ట్విటర్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. అందులో ఒక మహిళ తాను యోగి ఆదిత్యనాథ్ ప్రియురాలినని చెబుతోంది’’ అని ప్రశాంత్ భార్య జగీషా అరోరా బీబీసీకి తెలిపారు.
ఈ వీడియోతో పాటు ప్రశాంత్.. యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు.
ఈ వ్యవహారంలో ప్రశాంత్‌పై లఖ్‌నవూలోని హజర్‌తగంజ్ పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం సెక్షన్ 66, ఐపీసీ సెక్షన్ 500ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
అరెస్ట్ వ్యవహారంపై సమాజ్‌వాది పార్టీ స్పందించింది. ‘‘చట్టాన్ని రక్షించడంలో విఫలమైన ప్రభుత్వం విలేకరులపై తన ప్రతాపం చూపిస్తోంది’’ అని ట్వీట్ చేసింది.
కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో ‘అభ్యంతరకరమైన వ్యాఖ్య’ చేసినందుకు ఒక టీవీ న్యూస్ చానెల్ హెడ్, ఎడిటర్‌ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ట్వీట్ కూడా చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్‌కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- మోదీ తొలి విదేశీ పర్యటనకు మాల్దీవులనే ఎందుకు ఎంచుకున్నారు
- #INDvAUS జింగ్ బెయిల్స్: ‘బాల్ వికెట్లకు తగిలినా బెయిల్స్ పడకపోవడం ఈ ప్రపంచకప్‌లో ఇది ఐదోసారి’
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు
- పాకిస్తాన్ బడ్జెట్: ఈ అప్పుల 'విషవలయం' నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేది ఎలా?
- యూట్యూబ్ ప్రాంక్: బిస్కెట్లలో టూత్‌పేస్టు.. 15 నెలలు జైలు, 15 లక్షలు జరిమానా
- రంగుల జెర్సీలు ఎలా వచ్చాయి... వాటి నంబర్ల వెనుక కథేంటి... శ్రీలంక జెర్సీ ఎందుకంత ప్రత్యేకం
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా
- లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)