You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే అని అనుమానిస్తున్న పోలీసులు, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(68) శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు.
గుండెపోటు వల్ల వివేకానందరెడ్డి పులివెందులలో మృతిచెందారని సాక్షి దినపత్రిక తెలిపింది. కానీ, మృతదేహం పడి ఉన్న స్థలాన్ని చూస్తే అది హత్యలాగా అనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకానందరెడ్డి తలపైన, చేతులపైనా గాయాలున్నాయని కడప ఎస్పీ మీడియాకు తెలిపారు.
దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు.
వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు.
తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు.
వివేకానందరెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు.
1989,1994లలో పులివెందుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1999, 2004 లలో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు.
ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
వివేకానంద రెడ్డి మృతిపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివేకా తలకు, చేతికి గాయాలు అయ్యాయని, ఆయన రక్తపు మడుగులో.. బాత్‌రూమ్‌లో పడి ఉన్నారని కృష్ణారెడ్డి తెలిపారు.
దీంతో అనుమానాస్పద మృతిగా కేసు (నంబర్ 84/19) నమోదు చేశామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- జనసేన పార్టీ అభ్యర్థులు వీరే
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందిస్తా: 'సమర శంఖారావం'లో జగన్
- మసీదులో కాల్పులు.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు క్షేమం.. NZvsBAN మూడో టెస్టు రద్దు
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)