You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Fact Check: 'మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'సోనియా గాంధీ హిందూ ద్వేషి' అని రాశారా?
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
సోషల్ మీడియాలో మితవాద గ్రూపులు ఒక అవాస్తవాన్ని, రెచ్చగొట్టే ఆర్టికల్‌ను వేగంగా షేర్ చేస్తున్నాయి.
ఆ ఆర్టికల్ హెడ్‌లైన్లో "హిందువులను ద్వేషించిన సోనియా గాంధీ, బయటపెట్టిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ" అని ఉంటుంది.
వాట్సాప్‌లో కూడా చాలా మంది బీజేపీ మద్దతుదారుల గ్రూపుల్లో ఈ రెచ్చగొట్టే కంటెంట్ గత కొన్నిరోజులుగా షేర్ అయ్యింది. ఫేస్‌బుక్, ట్విటర్‌లో కూడా దీనిని వేల మంది షేర్ చేశారు.
కొంతమంది పోస్ట్ కార్డ్ న్యూస్, హిందూ ఎగ్జిస్టెన్స్, పెర్ఫామ్ ఇన్ ఇండియా, పేరుతో ఉన్న కొన్ని వెబ్‌సైట్ల లింకులు కూడా షేర్ చేశారు. వారు ఈ అబద్ధపు వార్తకు తమ వెబ్‌సైట్‌లో చోటిచ్చారు.
2018లో ఈ వెబ్‌సైట్లలో ప్రచురించిన ఆర్టికల్లో కూడా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో "కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ హిందూ విరోధి అని చెప్పారని" ఉంది.
ఇది పూర్తిగా అవాస్తవం
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా 2018 ఫిబ్రవరి-మార్చిలో కూడా ఈ లింక్స్‌ను సోషల్ మీడియాలో చాలా సార్లు షేర్ చేసినట్లు తెలిసింది.
కానీ ఏడుకు పైగా పుస్తకాలు రాసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017లో ప్రచురితమైన 'ద కొలేషన్ ఇయర్స్:1996-2012' అనే పుస్తకంలో నిజంగానే సోనియా గాంధీ గురించి ఇలాంటి మాటలు రాశారా?
దీని గురించి తెలుసుకోడానికి మేం కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆఫీస్‌లో మాట్లాడాం.
ప్రణబ్ ముఖర్జీ ఆఫీస్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన పుస్తకంలో సోనియా గాంధీని 'హిందూ విరోధి'గా, 'సోనియా గాంధీ హిందువులను ద్వేషించేవారని' చెబుతూ రాసినట్లు ఏమీ లేదు.
ఇటు బీబీసీతో మాట్లాడిన శర్మిష్టా ముఖర్జీ "ఇది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి వార్తలు దుష్ప్రచారం తప్ప నిజం కాదు" అన్నారు.
2018లో జూన్ 7న నాగపూర్‌లో ఉన్న ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అక్కడ ఆయన ప్రసంగించారు. అప్పుడు ఆయన కూతురు శర్మిష్టా ముఖర్జీ ట్విటర్‌లో తండ్రిని హెచ్చరించారు.
శర్మిష్టా ముఖర్జీ జూన్ 6న ట్విటర్‌లో "ప్రజలు మీ స్పీచ్ మర్చిపోతారు. ఫొటోలు, విజువల్స్ అలాగే ఉండిపోతాయి. వాటిని తప్పుడు ప్రకటనలతో సర్కులేట్ చేస్తారు. నాగపూర్ వెళ్లిన మీరు మీ గురించి అబద్ధపు వార్తలను ప్లాంట్ చేసేలా బీజేపీ, ఆరెస్సెస్‌కు చాన్స్ ఇస్తున్నారు" అని రాశారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: కనీస ఆదాయ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదా?
- Fact Check: ఈ అన్నాచెల్లెళ్ళ మధ్య తేడా ఆరు నెలలేనా?
- జార్జి ఫెర్నాండెజ్: 'ఎమర్జెన్సీ టైమ్‌లో ఆయనను కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారనిపించింది'
- ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టులు మీకు కావాలా?
- మోదీ కోటి ఉద్యోగాల హామీ నిజమా? అబద్ధమా? BBC REALITYCHECK
- మోదీ ప్రభుత్వంలో రాజీనామాలు ఎందుకు జరగవు?
- ప్రధాని మోదీ కుంభమేళాలో స్నానం చేయడం నిజమేనా?
- సింగపూర్‌కి ఇంత తక్కువ సమయంలో అంత సంపద ఎలా వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)