You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాహుల్, ప్రియాంక గాంధీలు ఆర్నెల్ల తేడాతోనే పుట్టారా? - Fact check
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు అధికారిక పత్రాల్లో తమ వాస్తవ పుట్టిన తేదీలనే పేర్కొంటున్నారా? అంటూ కొన్ని మితవాద గ్రూపుల సోషల్ మీడియా పేజీల్లో ప్రశ్నలు కనిపిస్తున్నాయి.
'వీకీపీడియా' ప్రకారం, రాహుల్, ప్రియాంకల పుట్టిన తేదీలకు మధ్య తేడా ఆర్నెల్లే ఉన్నట్లుగా చూపుతున్న ఒక స్క్రీన్ షాట్‌ను ఆ పేజీల్లో పోస్ట్ చేశారు.
దానిని వేలాది మంది ఇతర పేజీలలో షేర్ చేశారు.
'రాహుల్ గాంధీ పుట్టిన తేదీలో పెద్ద స్కాం ఉంది. ప్రియాంక జన్మించిన తర్వాత ఆరు నెలలకే రాహుల్ గాంధీ పుట్టారట" అంటూ ఆ స్క్రీన్ షాట్‌కు ఓ సందేశాన్ని జోడించి షేర్ చేశారు.
రాహుల్, ప్రియాంకల పుట్టిన తేదీల గురించి హిందీ టీవీ ఛానెల్ ఆజ్ తక్ కూడా ఓ కథనాన్ని ప్రసారం చేసిందంటూ మరో చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.
కానీ, మా పరిశీలనలో అవి తప్పుడు వాదనలని తేలింది.
ఆ ఫేస్‌బుక్ పేజీల్లో షేర్ చేస్తున్న వికీపీడియా చిత్రం నకిలీదని వెల్లడైంది. వాస్తవంగా వికీపీడియాలో రాహుల్ గాంధీ పుట్టిన తేదీ 1970 జూన్ 19 అని, ప్రియాంక పుట్టిన తేదీ 1972 జనవరి 12గా ఉంది. దాని ప్రకారం చూస్తే, ఇద్దరి మధ్య తేడా 18 నెలల 24 రోజులు ఉంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక వెబ్‌సైట్లలోనూ ఈ ఇద్దరి పుట్టిన తేదీలను పేర్కొన్నారు.
అలాగే, వీరి పుట్టిన తేదీల విషయంపై ఆజ్ తక్ ఛానెల్ కథనం ప్రసారం చేసినట్లుగా ఏ ఆధారమూ లభించలేదు.
ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని, జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నకిలీ స్క్రీన్ షాట్‌లను సృష్టించినట్లు అర్థమవుతోంది.
ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా 2014 ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోరంగా పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆమె చనిపోతే రెండో బాలిక కూడా చనిపోతారు
- బస్సెక్కుంతుంటే చీర చిరిగిందని..
- రాహుల్ గాంధీకి 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది
- ఆమె చనిపోతే రెండో బాలిక కూడా చనిపోతారు
- అమెరికా యాత్రికుడిని 'చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు'
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- ‘రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రకు నిజంగానే వెళ్లారా? ఫొటోషాప్ చేస్తున్నారా?’
- పెళ్లి గురించి రాహుల్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)