ఐఎంఎఫ్: ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్

2019లో ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్స్‌లో భారత్ బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2018లో ఆ జాబితాలో బ్రిటన్ ఐదో స్థానంలో ఉంది.
ఈ ఏడాది భారత్ ఫ్రాన్స్‌ను వెనక్కు నెట్టి ఆరో స్థానానికి చేరింది. వచ్చే సంవత్సరం బ్రిటన్ ఈ రెండు దేశాలకంటే కిందకు, అంటే 7వ స్థానానికి పడిపోతుందని ఐఎంఎఫ్ చెబుతోంది.
స్థూల జాతీయోత్పత్తి ప్రకారం చూసుకుంటే 2018లో బ్రిటన్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారత్ లాంటి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు మరింత బలోపేతమవుతుండటంతో ఆ ప్రభావం బ్రిటన్ ర్యాంకింగ్‌పైన పడుతోంది.
ఐఎంఎఫ్ తాజా అంచనాలు భారత్, ఫ్రాన్స్ దేశాలకు మంచివే అయినా, బ్రెగ్జిట్ రూపంలో యురోపియన్ యూనియన్ నుంచి విడిపోవడానికి సిద్ధమవుతున్న బ్రిటన్‌కు మాత్రం ఇది చేదు వార్తే.
మరోపక్క విడిపోయిన తరువాత కూడా ఆర్థిక వ్యవస్థను అంతే బలంగా ఉంచడం ఆ దేశం ముందున్న మరో సవాల్.

బ్రెగ్జిట్ తరువాత కూడా తాము అంతే శక్తిమంతంగా ఉంటామని బ్రిటన్ పదేపదే చెబుతోంది.
ఐఎంఎఫ్ అంచనాలు వెలువడకముందే, పీడబ్ల్యసీ ఆర్థిక నిపుణుడు మైక్ జాక్మన్ ర్యాంకింగ్స్‌లో బ్రిటన్ పతనాన్ని అంచనా వేశారు. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒక్కటైన భారత్ ప్రపంచ జీడీపీ రేసులో ముందు నిలుస్తుందని, ఎక్కువ జనాభా, వేగవంతమైన అభివృద్ధి అందుకు కారణమని ఆయన చెప్పారు.
ఈ ఏడాది జూలైలో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదిక కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌ను దాటిసేందని పేర్కొంది. కానీ ఐఎంఎప్, ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం పదేళ్ల క్రితం భారత జీడీపీ ఫ్రాన్స్ జీడీపీలో కేవలం సగమే ఉండేది.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని ప్రవేశ పెట్టాక దేశ ఆర్థిక వ్యవస్థలో ఆటు పోట్లు తలెత్తినా, తయారీ రంగం ఊపందుకోవడంతో ఆర్థిక వ్యవస్థలో కూడా ఎదుగుదల వేగవంతమైంది.
ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం 2018లో భారత వృద్ధి రేటు 7.4శాతం ఉంటే, 2019లో అది 7.8 శాతానికి చేరుతుంది. మరోపక్క ప్రపంచ సగటు వృద్ధి రేటు 3.9 శాతమే ఉంటుందని అంచనా. అంటే ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

బ్రిటన్‌లో సమస్యలు
ఒకే తరహా అభివృద్ధి, జనాభా కలిగిన బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆర్థిక వృద్ధి ర్యాంకుల్లో కూడా మొదట్నుంచీ ఒక దాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. వచ్చే ఏడాది బ్రెగ్జిట్ తరువాత కూడా బ్రిటన్ ఎంత స్థిరంగా ఉంటుందనేదానిపై బ్రిటన్ ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది.
బ్రెగ్జిట్ కారణంగా అంతర్జాతీయంగా బ్రిటన్ తన ప్రాబల్యాన్ని కోల్పోతుందని విమర్శకులు అంటున్నారు. బ్రిటన్‌ను ఒక మధ్య స్థాయి దేశంగా, మధ్యస్థ ర్యాంకింగ్ ఉన్న దేశంగా ప్రపంచం చూస్తుందని ఆ దేశ మాజీ ప్రధాని జాన్ మేజర్ హెచ్చరించారు.
ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2023 వరకు బ్రిటన్‌లో ఇదే స్థితి కొనసాగుతుంది. ఈ జాబితాలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- ఆన్లైన్లో అమ్మాయిలు.. ఈ ఒంటరితనానికి పరిష్కారమేంటి
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- రోడ్డు వేసుకున్నారు... రాత మార్చుకున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








