గాంధీజీని విమర్శించడం కొందరికి అలవాటైపోయింది: గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ

వీడియో క్యాప్షన్, గాంధీజీని విమర్శించడం కొందరికి అలవాటైపోయింది: గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ

ఘానా రాజధాని ఆక్రాలోని విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఇటీవల తొలగించారు. నల్లజాతీయుల పట్ల గాంధీ వివక్ష చూపారంటూ కొంతకాలంగా అక్కడి అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

ఈ విగ్రహాన్ని 2016లో నాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు.

భారతీయులు మహాత్మునిగా కీర్తించే గాంధీజీని, నేడు ఆఫ్రికాలో జాత్యహంకారి అని నిందిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు నివాసమున్న గాంధీ, నల్లజాతీయులను వివక్షతో చూశారన్న ఆరోపణలు ఉన్నాయి.

నల్లజాతీయులను కాఫిర్లని పిలవడంతో పాటు, భారతీయులతో పోలిస్తే వారికి నాగరికత తక్కువనే అభిప్రాయాలను గాంధీ వెల్లడించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి.

అయితే, దక్షిణాప్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ పాతికేళ్ల యువకుడనీ, ఆయన లోపాలను నాటి ఆయన అవగాహనా స్థాయిని బట్టి అర్థం చేసుకోవాలని అనేవారు కూడా ఉన్నారు.

తాజాగా ఘానాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీబీసీ ప్రతినిధి మయూరేశ్ కొన్నార్... గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీతో మాట్లాడారు. ఆఫ్రికన్ల పట్ల గాంధీజీ అభ్యంతరకరమైన మాటల్ని ఉపయోగించింది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ కింది విధంగా జవాబిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)