అంబానీల పెళ్లి సందడి: కలవారి ఇంట తారాతోరణం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ముంబైలో జరిగింది.

ఇషా పారిశ్రామికవేత్త ఆనంద్ పీరామల్‌ను పెళ్లాడారు.

ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం కోసం ముంబైలోని అంబానీ హౌస్‌ను పుష్పాలతో, విద్యుద్దీపాలతో అలంకరించారు.

ఇషా వివాహ ఏర్పాట్లలో, అతిథుల మధ్య బిజీగా ఉన్న ముకేశ్ అంబానీ

వివాహ వేడుకల్లో కాబోయే భార్య శ్లోకా మెహతాతో కలిసి అతిథులను ఆహ్వానిస్తున్న ఆకాశ్ అంబానీ

ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ రాయల్ స్టైల్లో పెళ్లి మండపం దగ్గరికి చేరుకున్నారు.

ఇషా వివాహం కోసం తరలివచ్చిన అతిథులు

వివాహ వేడుకకు హాజరైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అనిల్ అంబానీ

ఇషా పెళ్లికి భార్య కిరణ్ రావ్‌తో వచ్చిన అమీర్ ఖాన్

వివాహ వేడుకలో ఇటీవలే పెళ్లి చేసుకున్న ప్రియాంక, నిక్ జోనస్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పెళ్లి వేడుకలో భార్య ఐశ్వర్యా రాయ్, కుమార్తె ఆరాధ్యతో అభిషేక్ బచ్చన్

సోదరి ఇషా అంబానీ వివాహం సందర్భంగా గుర్రాలపై అకాశ్ అంబానీ, అనంత్ అంబానీ

ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ఆనంద్ పీరామల్‌తో ఘనంగా జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)