You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
టీఆర్ఎస్ నేత హరీశ్ రావు భారీ ఆధిక్యంతో గెలవడంతో ఆయన దేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారని వార్తలు వెలువడుతున్నాయి.
సిద్ధిపేట నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన హరీశ్ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు వరసుగా ఇది ఏడో విజయం. 2004 ఉప ఎన్నికల నుంచి ఆయన భారీ అధిక్యతతో గెలుస్తూనే ఉన్నారు.
ఈసారి లక్ష కంటే ఎక్కువ మెజారిటీ సాధించిన హరీశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజారిటీ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే, దేశంలో అత్యధిక మెజారిటీ సాధించిన రికార్డు సునీల్ కుమార్ శర్మ పేరిట ఉంది.
2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాహిబాబాద్ అసెంబ్లీ నియోజకర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన సునీల్ కుమార్ శర్మ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత అమర్ పాల్ శర్మ మీద 1,50,685 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డుగా ఉంది.
ఘాజియా బాద్ జిల్లా పరిధిలో ఉండే సాహిబాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 8,65,641గా ఉంది. 2017 ఎన్నికల్లో సునీల్ కుమార్ శర్మకు 2,62,741 ఓట్లు రాగా, అమర్ పాల్ శర్మకు 1,12,056 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో సునీల్ శర్మ 61.69 శాతం ఓట్లు సాధించారు.
ఇవి కూడా చదవండి
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: 'మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)