You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోహిత్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బ్రేక్
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించాడు.
టీ 20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడుగా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ 86 టీ20ల్లో మొత్తం 2203 పరుగులు చేశాడు.
ఇప్పటి వరకూ ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది.
ఈ రోజు మ్యాచ్ మొదలుకాక మందు రోహిత్ అత్యధిక పరుగుల రికార్డుకు కేవలం 11 పరుగుల దూరంలోనే ఉన్నాడు.
ఇప్పటి దాకా 2102 పరుగులతో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 60 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మొత్తం ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయడంతో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నపుడు ఆమెకు ఇద్దరు భర్తలు ఎందుకు ఉండకూడదు?
- విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- కర్ణాటక ఫలితాలపై మోదీ, రాహుల్ ఇద్దరూ పరేషాన్.. ఎందుకు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- దీపావళి హరిత టపాసులు: ‘ధర తక్కువ.. మోత ఎక్కువ.. పైగా కాలుష్యం లేకుండా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)