You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడటం ఎలా?.. డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి?
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్... ఇలాంటి యాప్స్ జీవితంలో భాగమైపోయాయి. కానీ సోషల్ మీడియాను 6 గంటల కంటే ఎక్కువ సేపు ఉపయోగిస్తే ఆరోగ్యంతో పాటు పనిపైనా ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు ఒత్తిడితో బాధపడుతున్నారు. సోషల్ మీడియా నుంచి బయటపడేందుకు కొందరు డిజిటల్ డిటాక్స్ పద్ధతిని పాటిస్తున్నారు.
సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడమే డిజిటల్ డిటాక్స్. ఆ విరామం కొద్ది గంటలే కావొచ్చు, లేదా కొన్ని రోజులు కావొచ్చు.
డిజిటిల్ డిటాక్స్ అంటే ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి
ఆ విరామంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ పుస్తకం చదవడం, ఆడుకోవడం, వ్యాయామం లాంటి పనులు చేయొచ్చు. అనుకున్న సమయం ముగిశాక మళ్లీ సోషల్ మీడియాకు రావొచ్చు.
ఎలాంటి అవసరం, కారణం లేకుండా సోషల్ మీడియాలో స్ర్కోల్ చేయడాన్ని నివారించడం అలవాటు చేసుకోవాలి.
డిజిటల్ డిటాక్స్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఒత్తిడి స్థాయులు 27శాతం దాకా తగ్గుతాయి. దీని వల్ల 6 శాతం ఎక్కువ సంతోషంగా ఉండొచ్చు. పనితీరు కూడా 8 శాతం మెరుగుపడుతుంది.
ఇవి కూడా చదవండి
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- సోషల్ మీడియా: కావాలనే యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- వాట్సాప్, ఫేస్‌బుక్‌లపై రోజుకు మూడు రూపాయల పన్ను
- నొక్కువిద్య పవక్కలీ: ఈ బొమ్మల కళను కాపాడుతున్న చివరి వ్యక్తి ఈ అమ్మాయే
- ఈ గణేశుడు... చేపలకు స్నేహితుడు
- ఆ ఊళ్లో బతకాలంటే ఆపరేషన్ తప్పనిసరి
- ‘రాజకీయ నాయకుల వివాహేతర సంబంధాలపై సంబంధాలపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు. ఎందుకు?’
- లైంగికానందం కోసం మహిళలు సెక్స్ చేయటం సరికాదని మహాత్మా గాంధీ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)