ప్లాస్టిక్‌తో పెట్రోల్ తయారు చేస్తున్న హైదరాబాదీ ప్రొఫెసర్
సంగీతం ప్రభాకర్, బీబీసీ తెలుగు ప్రతినిధి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్టిక్ మనిషికి ప్రధాన శత్రువుగా మారింది. ఈ ప్లాస్టిక్ ప్రాణాలను సైతం కబళించేస్తోంది. కేన్సర్ కారకంగానూ మారి విషం చిమ్ముతోంది.
ప్లాస్టిక్ వ్యర్థాలు కరగడానికి వందల ఏళ్లు పడుతుంది. అంతే కాదు. ఆ చెత్త సముద్రాలనూ ముంచెత్తుతోంది. కానీ హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంజినీర్ ఈ సమస్యకు ఓ పరిష్కారం కనిపెట్టారు. అంతేకాదు, మానవాళికి ఎంతో అవసరమైన, ఖరీదైన పెట్రోల్‌ను ప్లాస్టిక్ నుండి పిండేస్తున్నారు.
500 కేజీల ప్లాస్టిక్ నుండి 400 లీటర్ల ఇంధనాన్ని సాధించవచ్చని ఆయన వివరిస్తున్నారు.
2015 సంవత్సరంలో విడుదలైన భారత ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశంలోని 60 ముఖ్య నగరాల్లో రోజుకు 3,501 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు 200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.
ప్లాస్టిక్‌ను కేవలం 6సార్లు మాత్రమే రీసైకిల్ చేయచ్చు. ఆ తర్వాత ఆ వ్యర్థాలను అలా వదిలేయాల్సిందే.
ఆ నిరుపయోగమైన వ్యర్థాల నుంచే పెట్రోల్ తీయొచ్చని అంటున్నారు ప్రొ. సతీశ్ కుమార్. ఈయన హైడ్రాక్సీ సిస్టమ్స్ & రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. పరిశోధనల తర్వాత చివరికి సాధించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేశాక పెట్రోల్ మాత్రమే కాదు.. డీజిల్‌ను, విమాన ఇంధనాన్ని కూడా తయారు చేస్తున్నారు.
ఆయన లెక్క ప్రకారం -
500 కేజీల ప్లాస్టిక్ నుంచి 400 లీటర్ల ఇంధనం వస్తుంది.
200-240 లీటర్ల డీజిల్, 80-100 లీటర్ల విమాన ఇంధనం, 60 లీటర్ల పెట్రోల్, మిగిలిన పదార్థాలు 20 లీటర్లు వస్తాయి.
అయితే ఈ ప్రయత్నంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విధానానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపున ఈ విధానానికి మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
మా ఇతర కథనాలు
- ఈ కుర్రాడిని హుస్సేన్ సాగర్‌కి పట్టుకొచ్చేద్దామా!
- పాకిస్తాన్: పదేళ్లకే స్టార్టప్ పెట్టింది.. ప్రపంచాన్ని రక్షిస్తానంటోంది!!
- అసలు ప్రపంచంలో పేదోళ్లు ఎందరు?
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
- ‘జుగాడ్’ విధానంలో ఉద్ధభ్ భరలి వినూత్న ఆవిష్కరణలు
- కేవలం 80 రూపాయలతో న్యుమోనియాకు చెక్!
- విషాన్ని శుద్ధి చేసే గుళికలు
- కేన్సర్‌తో పోయిన గొంతు రూ.60తో తిరిగి వస్తుంది!
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
- చెత్త, అట్టముక్కలతో ఇంటి పైకప్పులు
- గ్రామాల్లో మరుగుదొడ్ల సమస్యకు సరికొత్త పరిష్కారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)