You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
భారత క్రికెట్‌కు ఈ ఏడాది ఎన్నో ఎత్తు పల్లాలున్నాయి. టీమిండియా ఈ ఏడాది కొన్ని అద్భుతమైన క్షణాలను ఆస్వాదించగా.. కొన్ని హార్ట్ బ్రేకింగ్ ఓటములను కూడా చవిచూసింది.
కొందరు బ్యాట్స్‌మన్ చెలరేగిపోయి, తమ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నారు.
ఈ ఏడాది దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరో మనం ఒకసారి చూద్దాం...
1. శ్రేయాస్ అయ్యర్
48.75 పరుగుల సగటుతో మొత్తంగా 1,609 రన్స్ చేసిన శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఏడాది ఒక సెంచరీ, 14 అర్థ సెంచరీలతో శ్రేయాస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొట్టాడు. 113 పరుగులు ఆయన బెస్ట్ స్కోర్?
అలాగే ఈ ఏడాది 5 టెస్టులలో 60.28 పరుగుల సగటుతో ఎనిమిది ఇన్నింగ్స్‌లో 422 పరుగులు చేశాడు శ్రేయాస్ అయ్యార్. ఈ టెస్టులలో 4 అర్థ సెంచరీలను చేసిన ఘనతను శ్రేయాస్ దక్కించుకున్నాడు.
మొత్తంగా ఈ ఏడాది 17 ఓడీఐలు శ్రేయాస్ ఆడాడు.
ఈ ఓడీఐల్లో ఒక సెంచరీ, 6 అర్థ సెంచరీలతో 55.69 పరుగుల సగటుతో 724 రన్స్ చేశాడు.
టీ20ల్లో కూడా 35.61 పరుగుల సగటుతో 463 రన్స్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లలో 4 అర్థ సెంచరీలతో శ్రేయాస్ అయ్యర్ స్ట్రయిక్ రేటు 141.15గా ఉంది.
2. సూర్యకుమార్ యాదవ్
ఈ ఏడాది 31 టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఊహించని స్థిరత్వాన్ని ప్రదర్శించి, సిక్స్‌లతో చెలరేగిపోయాడు.
సగటున 46.56 పరుగులతో 1,164 రన్స్ చేశాడు.
ఈ ఏడాది ఫార్మాట్‌లో రెండు సెంచరీలు, 9 అర్థ సెంచరీలు చేశాడు. దీనిలో 117 పరుగులు చేయడం అతనికి బెస్ట్ స్కోరుగా నిలిచింది.
ఈ ఏడాది 13 ఓడీఐలను ఆడిన సూర్యకుమార్ యాదవ్.. ఒక అర్థ సెంచరీతో సగటున 26తో 260 పరుగులు చేశాడు.
మొత్తంగా ఈ ఏడాది 43 ఇన్నింగ్స్ ఆడాడు. వీటిల్లో 2 సెంచరీలు, 10 అర్థ సెంచరీలతో 40.68 పరుగుల సగటుతో 1,424 రన్స్ చేశాడు సూర్యకుమార్ యాదవ్.
3. రిషబ్ పంత్
ఈ ఏడాది 7 టెస్టులను ఆడిన రిషబ్ పంత్.. స్ట్రయిక్ రేటు 90.90గా ఉంది.
సగటున 61.81 పరుగులతో 680 రన్స్ చేశాడు రిషబ్ పంత్. ఈ టెస్టులలో రెండు సెంచరీలు, 4 అర్థ సెంచరీలు చేశాడు.
రిషబ్ పంత్ ఈ ఏడాది 12 ఓడీఐలు ఆడాడు. ఈ ఓడీఐలలో ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలతో సగటు 37.33తో 336 పరుగులు తీశాడు.
ఒక అర్థ సెంచరీతో సగటున కేవలం 21 పరుగులతో 21 ఇన్నింగ్స్‌ను ఆడిన రిషబ్ పంత్.. 25 టీ20ల్లో 364 పరుగులు చేశాడు.
మొత్తంగా ఈ ఏడాది 43 ఇన్నింగ్స్‌లో 1,380 పరుగుల స్కోరు చేశాడు పంత్. సగటున 37.29 పరుగులతో మూడు సెంచరీలు, ఏడు అర్థ సెంచరీలు చేశాడు.
4. విరాట్ కోహ్లి
ఈ ఏడాది ఆరు టెస్టులు, 11 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి.. ఒక అర్థ సెంచరీతో సగటున 26.50 పరుగులతో కేవలం 265 రన్స్ మాత్రమే చేశాడు.
ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలతో సగటున 27.45తో 11 ఓడీఐలలో 302 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు.
ఈ ఏడాది ఆడిన 20 టీ20 మ్యాచులలో 55.78 పరుగుల సగటుతో 781 పరుగులు చేశాడు విరాట్ కోహ్లి. ఈ మ్యాచులలో ఒక సెంచరీ, 8 అర్థ సెంచరీలు చేశాడు.
మొత్తంగా ఈ ఏడాది విరాట్ కోహ్లి స్కోరు 42 ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు, 11 అర్థ సెంచరీలతో 39.51 సగటుతో 1,348 పరుగులుగా నమోదైంది.
5. రోహిత్ శర్మ
ఈ ఏడాది రెండు టెస్టులు ఆడిన రోహిత్ శర్మ.. సగటున 30 పరుగులతో 90 రన్స్ చేశాడు. ఈయన బెస్ట్ స్కోరు 46గా ఉంది.
ఎనిమిది ఓడీఐలలో మూడు అర్థ సెంచరీలతో సగటున 41.50తో 249 పరుగులు చేశాడు రోహిత్.
ఈ ఏడాది ఆడిన 29 టీ20లలో సగటున 24.29తో 656 పరుగులను చేసిన రోహిత్ శర్మ స్ట్రయిక్ రేటు 134.42గా ఉంది. ఈ మ్యాచులలో మూడు అర్థ సెంచరీలను రోహిత్ చేశాడు.
మొత్తంగా ఈ ఏడాది 40 ఇన్నింగ్స్‌లో 995 పరుగులు చేశాడు. 6 అర్థ సెంచరీలతో 27.63 పరుగుల సగటు నమోదు చేశాడు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
- సైన్యంలో పనిచేస్తున్న కొడుక్కి తండ్రి వార్నింగ్: ‘బిడ్డా నిన్ను కచ్చితంగా చంపేస్తాను’
- చైనా ప్రధానిని చంపడానికి భారత విమానంలో బాంబు పెట్టినప్పుడు ఏం జరిగింది
- రొయ్యల సాగు రైతులను ఎందుకు కష్టాల్లోకి నెడుతోంది, వారి ఆందోళనకు కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)