ఇజ్రాయెల్-పాలస్తీనా: మరింత మంది పౌరులకు తుపాకులు ఇస్తామన్న నెతన్యాహు ప్రభుత్వం

ఇజ్రాయెల్-పాలస్తీనా: మరింత మంది పౌరులకు తుపాకులు ఇస్తామన్న నెతన్యాహు ప్రభుత్వం

వెస్ట్ బ్యాంక్‌లో 'బ్రేక్ ద వేవ్' పేరుతో ప్రారంభించిన ఆపరేషన్‌లో భాగంగా మిలిటెంట్ గ్రూపులను టార్గెట్ చేస్తూ, వారు దాడులకు పాల్పడకుండా నిరోధించేందుకు రైడ్స్ చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.

వీటిలో చాలా దాడులు ఎక్కువ జన సమ్మర్ధంగల ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అక్కడ సాయుధులు ప్రతిఘటిస్తుండటంతో అవి హింసాత్మకంగా మారుతున్నాయి.

మిలిటెంట్ గ్రూపులను బలహీనపర్చడానికి, దాడులను నిరోధించడానికి ఆపరేషన్ కొనసాగించాల్సిందేనంటోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం.

అయితే, ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు జవాబుగానే తాము చర్యలకు దిగుతున్నామని పాలస్తీనీయులు అంటున్నారు.

ఈ దాడులు ముగిశాక, గన్ లైసెన్సుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్‌గవిర్ అన్నారు. లైసెన్సుల సంఖ్యను నెలకు 2 వేల నుంచి 10 వేలకు పెంచుతామన్నారు.

పౌరుల చేతుల్లో మరిన్ని గన్స్ ఉండాలని ఆయన చెప్పారు. అప్పుడే వాళ్లు ఆత్మరక్షణ చేసుకోగలుతారన్నారు.

వెస్ట్ బ్యాంక్‌లో ఉద్రిక్తతల మధ్య పౌరుల చేతుల్లోకి మరిన్ని గన్స్ వస్తే వారికి రక్షణ పెరుగుతుందా?

ఇవి కూడా చదవండి: