You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్మీ జీపుపై రాళ్లు విసిరిన యువకులు.. కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైన్యం
- రచయిత, టామ్ బేట్‌మేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో గత వారం ఇజ్రాయెల్ బలగాల దాడిలో పాలస్తీనా యువకుడిని కాల్చి చంపాయని మృతుడి కుటుంబ సభ్యులు బీబీసీకి చెప్పారు.
21 ఏళ్ల రాయద్-అల్-నాసన్ హత్యకు ఎలాంటి కారణాలు లేవని వాళ్లు ఆరోపించారు.
ఒకేరోజు జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు కాల్చి చంపిన నలుగురు వ్యక్తుల్లో రాయిద్ ఒకరు.
వెస్ట్‌బ్యాంక్‌లో పెరుగుతోన్న మృతుల విషయంలో EU దౌత్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది మరింత ఉద్రిక్తతకు దారి తీయవచ్చని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
ఈ వీడియోలో కలచివేసే దృశ్యాలు కొన్ని ఉన్నాయి.
రాయిద్-అల్-నాసన్‌ను ఇజ్రాయెలీ సైనికులు మంగళవారం కాల్చి చంపారు. వేర్వేరు గ్రామాల్లో తమ బలగాలను ఎదిరించిన నలుగురిని ఇజ్రాయెల్ కాల్చి చంపింది. వారిలో రాయిద్ కూడా ఉన్నాడు.
పాలస్తీనీయులకు ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో రెండు దశాబ్దాలుగా అత్యంత ఘోరమైన సంవత్సరం ఇదేనని ఐక్యరాజ్య సమితి అంటోంది.
ఇదొక చిన్న గ్రామం. అయినప్పటికీ వేల మంది ప్రజలు అంతిమ వీడ్కోలు కోసం తరలివచ్చారు. ఇవి ఇక్కడ తరచుగా జరుగుతున్నాయి. పాలస్తీనీయుల్లో కట్టలుతెంచే ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
ఇజ్రాయెల్ సైనికులు, దగ్గర్లో ఉన్న వలస వచ్చినవారిని ఎదిరించగలిగే శక్తి తమకు లేదని గ్రామస్తులు భావిస్తున్నారని రాయిద్ కుటుంబం చెబుతోంది. అతని తల్లి ఫత్మా ఇప్పుడిపుడే షాక్ నుంచి కోలుకుంటున్నారు.
రాయిద్ మృతితో – ఇజ్రాయెల్ ప్రయోగిస్తోన్న ప్రాణాంతక భద్రతా బలగాలను ప్రపంచం గమనిస్తోంది.
పర్మిట్ లేని భవనాన్ని కూల్చేసే ప్రణాళికతో ఇజ్రాయెల్ భద్రతా బలగాలు ముందుకెళ్లాయి.
అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను రాయిద్ బంధువులు చిత్రీకరించారు. తమ సైనికులపై పెట్రోల్ బాంబులు వేసిన అనుమానితులపై ప్రతిస్పందనగానే కాల్పులు జరిపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది.
కానీ బీబీసీకిచ్చిన వీడియోలో విషయాలు మరోలా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసినప్పుడు కనిపించే సాధారణ దృశ్యాలివి. లేత గోధుమ రంగు బట్టల్లో కనిపిస్తున్న రాయిద్, మిగిలిన గుంపు – ఇజ్రాయెల్ ఆర్మీ జీప్‌పైన రాళ్లు విసురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. కాల్పుల్లో రెండవ తూటా రాయిద్‌ను తాకింది.
తీవ్రంగా గాయపడిన రాయిద్ పరిగెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెంటనే పారామెడిక్స్ సాయం చేయడానికి వస్తున్నారు.
రాయిద్‌ను మొదటగా చేరుకున్న వ్యక్తి ముజాహిద్. అతడికి ఎక్కడ గాయమైందో చూపిస్తున్నారు.
‘‘ఎవరూ కూడా మొలొటోవ్ కాక్‌టైల్‌ను విసరలేదు. నేనిక్కడే ఉన్నాను. కొందరు యువకులు రాళ్లు రువ్వారు’’ అని ముజాహిద్ చెప్పారు.
రాయిద్‌కు 21 ఏళ్లు. పాలస్తీనా అథారిటీ సెక్యూరిటీ ఫోర్సెస్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే వెస్ట్‌బ్యాంక్‌లోని అనేక ప్రాంతాల్లో వీళ్ల పట్టు తగ్గుతోంది.
రాత్రి వేళల్లో ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినప్పుడు వారిపై మిలిటెంట్లు కాల్పులు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ ఆవాసాలపై ప్రాణాంతక దాడులు జరిగిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఇటువంటి దాడులు చేస్తోంది
ఇజ్రాయెల్ మిలిటరీ ఇచ్చిన ప్రకటనలో – వీడియోలో కొన్ని వివరాలనే చూపించారని, కొంత భాగాన్నే వాడారని, వాళ్లు పేలుడు పదార్ధమైన మొలొటోవ్ కాక్‌టైల్ బాటిళ్లను విసిరారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)