బీబీసీ వాట్సాప్‌ చానల్, కమ్యూనిటీస్‌ ప్రైవసీ నోటీస్

వాట్సాప్ లోగో ఫోటో

ఫొటో సోర్స్, EPA

మీ నమ్మకం మాకు చాలా ముఖ్యం.

మీ వ్యక్తిగత సమాచార గోప్యతకు, మీ సమాచార భద్రతకు బీబీసీ కట్టుబడి ఉంది. మీరు ఈ నోటీసు చదవడం చాలా ముఖ్యం. ఇది చదివితే మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఎలా, ఎందుకు ప్రాసెస్ చేస్తామో మీకు అర్థం అవుతుంది. మీరు మా సబ్‌స్క్రైబర్‌గా ఉన్న సమయంలోనూ, ఆ తరువాత కూడా డేటా ప్రొటక్షన్ చట్టానికి అనుగుణంగా మీ వ్యక్తిగత డేటాను మేము ఎలా సేకరిస్తామో, ఎలా ఉపయోగిస్తామో ఈ గోప్యతా నోటీసు వివరిస్తుంది.

ఎలాంటి వ్యక్తిగత సమాచారం బీబీసీ సేకరిస్తుంది? దాన్ని ఎలా ఉపయోగిస్తుంది?

మా చానల్‌, కమ్యూనిటీలో చేరే సమయంలో మీరు ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని బీబీసీ సేకరిస్తుంది. కింద పేర్కొన్న జాబితాలోని కొంత సమాచారం లేదా పూర్తి సమాచారం మేం సేకరిస్తాం.

వ్యక్తిగత డేటా

ఈ వ్యక్తిగత సమాచారం సేకరించొచ్చు.

  • మీ వాట్సాప్ ప్రొఫైల్‌లోని హ్యాండిల్/కనిపించే పేరు
  • మీ మొబైల్ నెంబర్
  • డిస్‌ప్లే పిక్చర్స్-డీపీ

మీ డిస్‌ప్లే పిక్చర్ స్వభావం, మీ గోప్యతా సెట్టింగ్‌లపై ఆధారపడి, సున్నితమైన సమాచారాన్ని బీబీసీ సేకరించి, ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. దీన్ని ప్రత్యేక కేటగిరీ డేటా అని పిలుస్తారు. ఉదాహరణకు ఈ కింద పేర్కొన్న వివరాలను సేకరించొచ్చు.

  • మీ జాతి, జాతీయత
  • మీ ఆరోగ్య సమాచారం
  • మీ మత లేదా తాత్విక విశ్వాసాలు
  • మీ లైంగిక ధోరణి
  • రాజకీయ అభిప్రాయాలు

మీ వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్‌...

మీ వాట్సాప్ ఖాతాలో మీ డిస్‌ప్లే పిక్చర్‌ను అందరూ చూసేలా మీరు అనుమతిస్తే, ఆ సమాచారాన్ని బీబీసీ కూడా చూడొచ్చనే విషయాన్ని మీరు గమనించండి. మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్లు మాత్రమే మీ డిస్‌ప్లే పిక్చర్‌ చూసేలా వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్‌ మార్చుకుంటే మంచిదని మేము ప్రోత్సహిస్తాం. అలా వాట్సాప్‌ ద్వారా మీరు మాతో పంచుకునే సమాచారాన్ని తగ్గించొచ్చు.

డేటా కంట్రోలర్ ఎవరు?

మీరు మాకు ఇచ్చిన సమాచారం, బీబీసీ పరికరాలు, వ్యవస్థలలో స్టోర్ అయిన డేటాపై నియంత్రణ స్వంత్రంతగా బీబీసీనే చేస్తుంది.

ఇక వాట్సాప్ మరొక ‘స్వతంత్ర డేటా కంట్రోలర్’. మీరు యాప్ ద్వారా పంపే సమాచారంపై వాట్సాప్ నియంత్రణ ఉంటుంది. వాట్సాప్ ప్రైవసీ పాలసీకి, సేవా నిబంధనలకు మీరు కూడా కట్టుబడి ఉంటారని గుర్తించండి. వాట్సాప్ మీ సమాచారాన్ని మెటా కంపెనీల మధ్య పంచుకోవచ్చు.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంతవరకు, దేనికోసం, ఎలా ఉపయోగించొచ్చో ప్రతి కంట్రోలర్‌ నిర్ణయం తీసుకుంటారు. మీరు మా వాట్సాప్ చానల్‌లో చేరి, ఫాలో అవుతున్న సమయంలో ఇచ్చిన సమాచారాన్ని ఈ గోప్యతా నోటీసులో పేర్కొన్న వాటి కోసం మాత్రమే బీబీసీ సేకరించి ప్రాసెస్ చేస్తుంది. డేటా ప్రొటెక్షన్ చట్టానికి అనుగునంగా నడుచుకోవడం, దాన్ని అమలు చేయడం ప్రతి కంట్రోలర్‌ బాధ్యత.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి చట్టబద్ద ప్రాతిపాదిక

మీ అంగీకారంతోనే మేం మీ వ్యక్తిగత డేటాను తీసుకుంటాం. ఎందుకంటే మీరే స్వచ్ఛందంగా మా వాట్సాప్ చానల్‌లో చేరారు. మా వాట్సాప్ చానల్‌ నుంచి నోటిఫికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్ మెసేజ్‌లు వద్దనుకుంటే, మా వాట్సాప్ చానల్‌ నుంచి మీరు ఎప్పుడైనా వైదొలగొచ్చు.

మీ సమాచారం మేము ఎవరికీ ఇవ్వం

మీ అనుమతి లేకుండా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏ థర్డ్ పార్టీకీ బీబీసీ ఇవ్వదు.

మీ సమాచారం ఎంతకాలం మా దగ్గర ఉంటుంది?

ఈ గోప్యతా నోటీసులో పేర్కొన్న ఉద్దేశం నెరవేరే వరకు అవసరమైనంత కాలం మీ వ్యక్తిగత డేటాను బీబీసీ ప్రాసెస్ చేస్తుంది.

మీ హక్కులు, ఇతర సమాచారం

యూకే డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం మీకు హక్కులు ఉన్నాయి. బీబీసీ సేకరించిన మీ వ్యక్తిగత సమాచారం కాపీని ఇవ్వమని మీరు అడగొచ్చు. మీ BBC ఖాతా డేటా, మా దగ్గరున్న మీ వ్యక్తిగత సమాచారం అందులో ఉంటుంది.

[email protected].ఈమెయిల్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. మీ హక్కుల గురించి ఇంకా సందేహాలు లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే బీబీసీ ప్రైవసీ, కుకీస్ పాలసీని http://www.bbc.co.uk/privacy. ని చూడొచ్చు.

మీ వ్యక్తిగత సమాచారాన్ని బీబీసీ ఎలా ప్రాసెస్ చేస్తుందోననే ఆందోళన మీకు ఉంటే యూకేలోని ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్ (ఐసీఓ) https://ico.org.uk/ ని సంప్రదించొచ్చు.

ఈ గోప్యతా నోటీస్‌ అప్‌డేట్ చేయడం..

మీ వ్యక్తిగత డేటాను మేం ఎలా వినియోగిస్తామనే విషయంలో గణనీయమైన మార్పులేమైనా ఉంటే మేం ఈ గోప్యతా నోటీసును సవరిస్తాం.