గాజాలో రోజూ 160 మంది పిల్లలు చనిపోతున్నారు- డబ్ల్యూహెచ్‌వో

ఫొటో సోర్స్, Reuters
గాజా నగరాన్ని ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. నగరం మధ్యలోకి చొచ్చుకెళ్లాయి.
హమాస్‌కు పట్టున్న కీలక ప్రాంతంపై ఉత్తరం వైపు నుంచి, దక్షిణం వైపు నుంచి ఇజ్రాయెల్ బలగాలు దాడులతో విరుచుకుపడుతున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు.
గాజాలో హమాస్‌కు చెందిన 130 సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
గాజాపై చేస్తున్న దాడులకు పాక్షిక విరామం ఇవ్వాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
కాల్పుల విరమణకు ససేమిరా అంటోన్న ఇజ్రాయెల్ ప్రధాని, పాక్షిక విరామ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
ఇప్పటికే గాజా తీవ్రంగా ధ్వంసమైంది. అనేక నివాస భవనాలు శిథిలాలుగా మారాయి. పౌరుల మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
గాజాలో రోజూ సగటున 160 మంది పిల్లలు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అంటే పది నిమిషాలకో చిన్నారి చనిపోతున్నారు.
ఇజ్రాయెల్, హమాస్‌లు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ ఆరోపించింది.
పూర్తి కథనం ఈ కింది వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- హమాస్‌ను తుడిచిపెట్టడం ఇజ్రాయెల్‌కు అంత ఈజీ కాదా?
- గాజాపై దాడులు: ‘పరిస్థితి ఘోరంగా ఉంది, గాజా ఈ భూమితో సంబంధాలు కోల్పోయింది’
- హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ ఎందుకు ప్రకటించలేదు?
- పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఎందుకు మారలేదు? 4 ప్రధాన కారణాలు ఇవే...
- ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ ఏనాటిది, ఎలా మొదలైంది? 9 పదాల్లో సంక్లిష్ట చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



