పెళ్లి ఫోటోలతో సోషల్ మీడియాలో వైరలైన ఈ జంట ఎవరు?
రిషబ్ రాజ్‌పుత్, సోనాలీ చౌక్సీ నూతన దంపతులు. జబల్పూర్‌లోని తమ ఇంట్లో మధ్యాహ్నం వేళ, నిశ్శబ్ద వాతావరణంలో సోఫా మీద కూర్చొని ఒక వీడియోను వారిద్దరూ పదేపదే చూస్తున్నారు. అది తమ వివాహం మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిన వీడియో.
నవంబర్ 23న వారి వివాహం సందర్భంగా రిషబ్ సోదరి రికార్డు చేసిన 30 సెకన్ల వీడియో అది.
రెండు రోజుల తర్వాత, అది వైరల్ అయి, లెక్కలేనన్ని వాట్సాప్ గ్రూప్‌ల నుంచి మీమ్ పేజీల వరకూ చేరింది.
ఈ వైరల్ మెసేజ్‌లలో వారికి వివాహ శుభాకాంక్షల మాటేమో కానీ, ఆ దంపతులిద్దర్నీ ట్రోల్ చేస్తూ వారి శరీర వర్ణం గురించి వ్యాఖ్యలే ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ జంట పెళ్లి 48 గంటల్లోనే దేశమంతా చర్చకు కేంద్రమైంది. సోషల్ మీడియాలో వీరి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇంతకీ ఏంటి వీరి కథ..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









