హైదరాబాద్‌ గణేశ్ నిమజ్జనోత్సవం, 15 ఫోటోలలో...

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. ఖైరతాబాద్ భారీ గణేశుడి విగ్రహ నిమజ్జనం ప్రశాతంగా ముగిసింది. భారీగా తరలివచ్చిన భక్త జన సందోహం మధ్య వినాయకుడు హుస్సేన్‌సాగర్‌లో కలిసిపోయాడు.

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమై, నిమజ్జనంతో ముగిసింది.

ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది.

ఎలాంటి భద్రత, ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన సీఎం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన భారీ క్రేన్ సాయంతో గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు.

నిమజ్జనం కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం 69 అడుగుల ఎత్తులో ఉంది. తొమ్మిదిరోజుల పాటు గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు.

భక్తుల కోలాటాలు, నృత్యాలతో గణనాథుల శోభాయాత్ర ఘనంగా సాగింది. భాగ్యనగర ఉత్సవ సమితి మార్గం వెంబడి వేదికలు ఏర్పాటు చేసి ఘనస్వాగతం పలికింది.

శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)