వనజీవి రామయ్య: ‘నువ్వేమైనా ఇందిరా గాంధీవా, రాజీవ్ గాంధీవా అని నన్ను చూసి నవ్వారు’
వనజీవిగా ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య గుండెపోటుతో మృతి చెందారు.
తెలంగాణకు చెందిన రామయ్య.. కోటి మొక్కలు నాటడంతో వనజీవి రామయ్యగా ప్రసిద్ధి చెందారు.
వృక్షాల ప్రాధాన్యం తెలిపే బోర్డులను అలంకరించుకొని నిత్యం పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన రామయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.
కెన్యాకి చెందిన వంగాయి మాతాయిని స్ఫూర్తిగా తీసుకుని మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్న రామయ్య కోటిమొక్కలకు పైగా నాటానని చెప్పారు.
తన చిన్నతనంలో ఉపాధ్యాయుడు మల్లేశం చెప్పిన 'మొక్కల పెంపకం- లాభాలు' అనే పాఠం స్ఫూర్తితోనే మొక్కలు పెంచాలనే ఆసక్తి కలిగినట్టు రామయ్య చెప్పేవారు. రామయ్య భార్య పేరు జానమ్మ. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా ముత్తగూడెం అయినా, పంటపొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో అక్కడ స్థిరపడ్డారు.
రామయ్య సామాజిక సేవను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2017లో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
రామయ్య జీవితాన్ని తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశంలో చేర్చింది.
రామయ్య మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు.
రామయ్య గురించి బీబీసీ 2019లో అందించిన కథనాన్ని పై వీడియోలో చూడొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









