You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హల్క్ హోగన్: రక్తం, చెమట, కన్నీళ్లతో కూడిన జీవితం, 9 ఫోటోలలో..
అమెరికన్ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ 71 ఏళ్ల వయసులో మరణించారు. 1980లలో రెజ్లింగ్ విశేషంగా ఆదరణ పొందడంలో హోగన్ కీలక పాత్ర పోషించారు.
హోగన్ 1977లో రెజ్లింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్(డబ్ల్యుడబ్ల్యుఎఫ్)లో చేరిన తర్వాత పేరు, ప్రఖ్యాతులు పొందారు.
హోగన్ రెజ్లింగ్‌లో ఎదగడంతో పాటు 2005 నుంచి 2007 వరకు వీహెచ్ 1 చానల్‌లో ప్రసారమైన రియాలిటీ షో ‘‘హోగన్ నోస్ బెస్ట్’’ ద్వారా కూడా ప్రసిద్ధి చెందారు.
2000వ సంవత్సరం తర్వాత మళ్లీ రెజ్లింగ్ రింగ్‌లోకి ప్రవేశించిన హోగన్ కొత్త తరం స్టార్లతో తలపడ్డారు. రెజ్లీమానియా X8లో డ్వైన్ ‘‘ది రాక్'' జాన్సన్‌తో జరిగిన పోరును ‘‘ఐకాన్ వర్సెస్ ఐకాన్’’గా పిలిచారు.
హోగన్ మొత్తం ఆరు డబ్ల్యుడబ్ల్యుఎఫ్/డబ్ల్యుడబ్ల్యుఈ చాంపియన్‌షిప్స్ గెలుచుకున్నారు.
హోగన్ కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. రెజ్లింగ్‌లో ఆయన ఎదిగే సమయంలో ఆ క్రీడ టీవీల్లో ప్రధాన వినోద సాధనమైంది.
హోగన్ జాతివివక్షకు సంబంధించిన పదం ఉపయోగించినట్టు ఓ వీడియోలో కనిపించింది. ఆ తర్వాత డబ్ల్యుడబ్ల్యుఈ ఆయన్ను సస్పెండ్ చేసింది. తర్వాత గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
ట్రంప్‌కు మద్దతుగా హోగన్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. గొప్ప స్నేహితుణ్ని కోల్పోయానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గత పదేళ్లలో తనకు కనీసం 25 శస్త్ర చికిత్సలు జరిగాయని గత ఏడాది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోగన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)