YouTube వీడియోలతో ప్రిపరేషన్.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు
YouTube వీడియోలతో ప్రిపరేషన్.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు
ఈయన పేరు శేషాద్రి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం ఓఎస్ గొల్లపల్లెకు చెందిన శేషాద్రి ఒకే ప్రయత్నంలో ఐదు టీచర్ పోస్టులకు అర్హత సాధించారు.
అంటే.. ఐదు ఉద్యోగాలకు పరీక్షలు రాయగా.. అన్నింటిలోనూ తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించారు.
స్కూల్ అసిస్టెంట్ సోషల్, SGT, టీజీటీ తెలుగు, TGT సోషల్, ఎస్ఏ తెలుగు పోస్టులకు పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యారు.

తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు అయినా తనకు ఏ లోటూ రానివ్వలేదని, తాను కష్టపడి ఉద్యోగాలు సాధించానని శేషాద్రి చెప్పారు.
ఈ పరీక్షలకు ఎలా ప్రిపేరయ్యారో శేషాద్రి వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









