ఫుట్‌బాల్ ప్రపంచ కప్: అర్జెంటీనాలో అంబారాన్నంటిన సంబరాలు

వీడియో క్యాప్షన్, దేశ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న జనం
ఫుట్‌బాల్ ప్రపంచ కప్: అర్జెంటీనాలో అంబారాన్నంటిన సంబరాలు

29 రోజులు.. 64 మ్యాచ్‌లు... 172 గోల్స్.... ఎన్నో విజయాలు... ఎన్నో చెదిరిన కలలు.... మరెన్నో ఆశ్చర్యకర ఫలితాలు.... ఖతార్ వేదికగా హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఫ్రాన్స్‌ను ఓడించి ఫిఫా వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది అర్జెంటీనా.

అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ... ఫుట్‌బాల్ రారాజుగా అవతరించారు.

అందరూ ఊహించినట్టే.. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ అయిరీస్ నగరంలో అర్ధరాత్రి వరకూ సంబరాలు జరిగాయి.

నగరం మధ్యలో ఉండే ప్రఖ్యాత ఒబెలిస్క్‌ వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.

అక్కడి ఫుట్‌బాల్ అభిమానులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు బీబీసీ ప్రతినిధి కేటీ వాట్సన్.

అక్కడి కోలాహలం ఎలా ఉందో, అభిమానులు ఏమంటున్నారో ఆమె అందించిన ఈ రిపోర్ట్‌లో చూద్దాం.

అర్జెంటీనాలో సంబరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)