You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చిత్రకూట్, తీర్థగఢ్ జలపాతాలకు ఎలా వెళ్లాలి?
- రచయిత, వీణా మాధురి సాదినేని
- హోదా, బీబీసీ కోసం
చుట్టూ కొండలు, దట్టమైన అరణ్య ప్రాంతం. ప్రకృతి ఒడిలో గలగలా పారుతున్న నది, అక్కడ నుంచి జాలువారుతున్న జలపాతపు అందాలు..తలచుకుంటేనే ఎంతో రమణీయంగా ఉంటుంది.
ఒక్కో రుతువుకు ఒక్కో రంగు మార్చే జలపాతం, ప్రపంచ ప్రసిద్ది గాంచిన నయగరాను పోలి ఉండే దేశంలోనే అతి వెడల్పైన జలపాతం..'చిత్రకూట్'.
ఇది ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్‌కి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది.
దీన్ని చిత్రకోట్ అని కూడా అంటారు. స్థానికులు చిత్రకూట్ అనే పిలుచుకుంటారు. పర్వత శ్రేణుల్లో పరుగులు పెట్టే ఇంద్రావతి నది నుంచి ఈ జలపాతం ఏర్పడింది.
దాదాపు వంద అడుగుల ఎత్తు నుంచి నీటి ధారలు పడుతుంటాయి. మన భారతదేశంలోనే అత్యంత వెడల్పుగా విస్తరించి ఉన్న ఈ జలపాతం పర్యటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది.
వెళ్లడం ఎలా?
డైరెక్ట్‌గా చిత్రకూట్‌కు వెళ్ళేమార్గాలు లేవు. జగదల్పూర్ వెళ్లి, అక్కడ నుండి చిత్రకూట్ చేరుకోవడం ఉత్తమం.
ఒక పక్క చిత్రకూట్ ఇంకొక పక్క తీర్థగడ్ జలపాతాలు ఉంటాయి.
జగదల్పూర్‌కు వాయుమార్గం ద్వారా చేరుకోవాలంటే రాయ్‌పూర్, విశాఖపట్నం సమీప విమానాశ్రయాలు. రాయ్‌పూర్ నుంచి జగదల్పూర్‌కు 292 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 290 కిలోమీటర్లు. ప్రయాణికులు తమకు సౌకర్యవంతమైన ఎయిర్ పోర్ట్‌ను ఎంపిక చేసుకుని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు.
దేశంలోని అన్ని ప్రదేశాల నుంచి జగదల్పూర్‌కు చక్కని రోడ్డు మార్గం ఉంది.
జగదల్పూర్‌కు చేరుకున్న తరువాత అక్కడే ఏదైనా హోటల్ లో బస చేసి, చిత్రకూట్ జలపాతాల సందర్శనకు వెళ్లవచ్చు.
జగదల్పూర్ నుంచి చిత్రకూట్ జలపాతాలకు 38 కిలోమీటర్ల దూరం. బస్సులు, ప్రైవేటు వాహనాలు నిత్యం ఉంటాయి.
రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి జగదల్పూర్ కు దాదాపు 550 కి.మీ. ఉంటుంది. కాబట్టి టైం సేవ్ చేయాలనుకునేవారు ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని రావడం బెటర్.
విశాఖపట్నం నుంచి జగదల్పూర్‌కు దాదాపు 300 కిమీ. దూరం. విశాఖపట్నం నుంచి జగదల్పూర్ మధ్య ప్రతి రోజూ రెండు రైళ్లు నడుస్తాయి.
ఎక్కడ ఉండాలి ?
చిత్రకూట్‌లో ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో బస చేయాలంటే, ఛత్తీస్‌గఢ్ టూరిజం వెెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి. ధర రూ. 3000 నుంచి రూ. 6000 వరకు ఉంటుంది.
ప్రైవేట్ కాటేజీలు లేవు. అదే జగదల్పూర్‌లో రూ. 2000 నుంచి రూ. 5000 మధ్య ఉంటుంది.
జగదల్పూర్‌లో బస చేస్తేనే బెటర్. అది చిత్రకూట్‌కు, తీర్థఘఢ్‌కు మధ్యలో ఉంది. ఒకరోజు చిత్రకూట్, ఇంకొకరోజు తీర్థగడ్ వాటర్‌ఫాల్స్ కవర్ చేయొచ్చు.
అంతే కాదు, 40 కిమీలో ఉన్న కంగేర్ వాలీ నేషనల్ పార్క్ ,43 కిమీలో ఉన్న కుటుంసర్ కేవ్స్ కూడా కవర్ చేయొచ్చు.
తినడం ఎక్కడ?
అడవిప్రాంతం కావడంతో అక్కడ రెస్టారెంట్లు, హోటల్స్ ఉండవు. మార్గమధ్యంలో రెండు మూడు ఊర్లు ఉంటాయి. అక్కడ ఊరికో దాబా అన్నట్లు ఉంటుంది.
ఫుడ్ కొంచం అడ్జస్ట్ చేసుకోవాలి. రోటి, నాన్ లాంటివి దొరుకుతాయి. అక్కడ ఉండేవాళ్ళకి జగదల్పూరే సిటీ . అక్కడే అన్ని తినడానికి, ఉండటానికి ఉంటాయి. ముందే ప్యాకెడ్ ఐటమ్స్ పెట్టుకొని వెళ్లడం ఉత్తమం.
ఇంకా చిత్రకూట్ వాటర్‌ఫాల్స్ దగ్గర లోపల రిసార్ట్స్‌లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. తీర్థగడ్ వాటర్‌ఫాల్స్ దగ్గర ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ రోటి, నాన్ అన్ని అందుబాటు ధరలలోనే ఉంటాయి. ఉదాహరణకు ఒక రోటి, కర్రీ వెరైటీని బట్టి రూ. 50 నుంచి రూ.150రూ వరకు ఉంటుంది.
చిత్రకూట్ వాటర్‌ఫాల్స్ స్పెషల్ అట్రాక్షన్.. నేచర్ ట్రయిల్స్. మెట్లు దిగి కిందకు వెళ్తే మంచి సీనరీ చూసినట్లు ఉంటుంది.
తీర్థగడ్ జలపాతం
తీర్థగడ్ జలపాతానికి నడిచే దారి పచ్చదనంతో నిండి ఉంటుంది. అటవీ ప్రాంతం కావడంతో కొంచెం భయం కూడా వేస్తుంది. జలపాతం చేరుకోవడానికి చాలా కిందకి దిగాలి. శబ్దం వినపడుతుంది కానీ, మెట్లన్నీ దిగేవరకు చెట్లు తప్ప ఇంకేం కనిపించవు.
కానీ ఆ చల్లని గాలి, ఆ అడవి పూల వాసన ఆస్వాదిస్తూ మెట్లు దిగితే వావ్ అనిపిస్తుంది.
అప్పుడే వచ్చిన సూర్యుడు, 299 అడుగుల నుంచి పడుతున్న ఆ తుంపరలు.. ఆ ఆనందం మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఈ వాటర్‌ఫాల్స్‌ని చూస్తుంటే, అచ్చం బాహుబలిలో అవంతికలా ఎగరలేకపోవచ్చేమో కానీ ప్రతి ఒక్కరికి బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ ఫీల్ మాత్రం కచ్చితంగా కలుగుతుంది. పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంతసేపు ఆడుకున్నా తనివి తీరదు. మేము వెళ్ళినప్పుడు 10 గంటల నుంచి జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. వచ్చిన వారు కూడా ఈ ప్లేస్‌ని చూసి చాలా సంతోషపడ్డారు.
"మేము కోల్‌కతా నుంచి వచ్చాం. ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. చాలా అందంగా ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాం. మెట్లు దిగితున్నప్పుడు కొంచం ఇబ్బందిపడ్డాం . ఈ ప్రకృతి అందాలు చూసాక నొప్పులు పోయాయి" అంటూ పియాలి దాస్ నవ్వుతూ చెప్పారు.
"నా పేరు సౌభా ప్రధాన్ మేము రాయపూర్ నుంచి వచ్చాం. ఇది నా ఫ్యామిలీ. మేం ఇక్కడికి వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చాం. మాకు ఈ వాటర్ ఫాల్స్ చాలా నచ్చాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మాకు బాగా నచ్చింది. మళ్లీ రావాలనిపిస్తోంది" అని మరొకరు చెప్పారు.
ఎప్పుడు వెళ్తే బెటర్ ?
ఇది కాంగెర్ వాలీ నేషనల్ పార్క్ చివర ఉంటుంది. వర్ష కాలంలో ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, అప్పుడు వెళితే బయట నుంచి చూడడానికి బావుంటుంది. కానీ, మిగతా ఏ రుతువులో వెళ్లినా, లోపలికి దిగి ఎంజాయ్ చేయొచ్చు.
ఛత్తీస్‌గఢ్ టూరిజం డిపార్ట్‌మెంట్ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రమాణాలను పాటిస్తూ, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కోతులు ఎక్కువ. వాటిని అదుపు చేయడం మాత్రం కొంచెం కష్టం.
బడ్జెట్ ఎంత?
బడ్జెట్ ఒకరికి: బస్సు మార్గం - టికెట్ - హైద్రాబాదు నుంచి జగదల్పూర్ - రూ. 1000 - రూ. 2000 రైలు మార్గం - రూ. 1500- 3000 రోడ్డు మార్గం - మీరొచ్చే దూరం బట్టి కి.మీ.కి రూ.16 - రూ.18 ఉండటానికి రూమ్ - రూ.2000- రూ.7000 చిత్రకూట్ చేరుకోడానికి క్యాబ్ - రూ.1500 - రూ. 1700 తీర్థగడ్ చేరుకోడానికి క్యాబ్ - రూ.2000 తినడానికి 2 రోజులకు - రూ. 2000 మార్గమధ్యలో ఖర్చులు - రూ. 200
ఇవి కూడా చదవండి:
- అమెజాన్: రోబోలు విస్తరించాయి.. కానీ ‘మనుషులు ఇంకా అవసరమే’
- 650 రూపాయల ట్విటర్ బ్లూ టిక్.. ఒక కంపెనీకి ఒక్క రోజులో రూ.1.22 లక్షల కోట్లు నష్టం తెచ్చింది.. ఎలాగంటే..
- పవన్ కల్యాణ్ మీద ఏపీ పోలీసుల కేసు: కారు టాప్ మీద ప్రయాణించడంపై ఫిర్యాదు
- ఆంధ్రప్రదేశ్: బాణాసంచా తయారీ కేంద్రాల్లో వరుస ప్రమాదాలు ఎందుకు నివారించలేకపోతున్నారు.. బాధ్యత ఎవరిది, ఏం చేయాల్సి ఉంది?
- వ్యాయామం: మానవులు ఎక్సర్సైజ్ చేయటం అసహజమా? చాలా మందికి వ్యాయామం ఎందుకు ఇష్టం ఉండదు? – మానవపరిణామ శాస్త్రవేత్త చెప్తున్న 4 విషయాలు