You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్రిస్ హెమ్స్‌వర్త్: ‘థోర్’కు అల్జీమర్స్ ముప్పు.. నటనకు బ్రేక్ ఇచ్చిన హాలీవుడ్ హీరో
- రచయిత, స్టీవ్ మెషింతోష్
- హోదా, ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్
యాక్టర్ క్రిస్ హెమ్స్‌వర్త్ నటనకు విరామం ప్రకటించారు. తనకు అల్జీమర్స్ వ్యాధి ముప్పు తీవ్రత అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
థోర్ పాత్రతో పాపులర్ అయిన హెమ్స్‌వర్త్ ఇటీవల డిస్నీ ప్లస్ కోసం నటిస్తున్న లిమిట్‌లెస్ డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా అల్జీమర్స్ ముప్పు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
అల్జీమర్స్ ముప్పు ఉన్నట్లు ఆరోగ్య పరీక్షలలో నిర్ధరణైందని.. ఇప్పుడిక ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నానని ‘ది వేనిటీ ఫెయిర్’తో మాట్లాడుతూ హెమ్స్‌వర్త్ చెప్పారు.
అల్జీమర్స్ వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు, కన్‌ఫ్యూజన్, కమ్యూనికేషన్ ఇష్యూస్ వస్తాయి.
తన తల్లి, తండ్రి నుంచి సంక్రమంచిన రెండు ఏపీవోఈ-4 జన్యువులు తనలో ఉన్నాయని పరీక్షల్లో తేలిందని హెమ్స్‌వర్త్ వెల్లడించారు. ఇవి రెండు జన్యువుల ఉన్న కారణంగా మిగతావారి కంటే 8 నుంచి 10 రెట్లు అధికంగా అల్జీమర్స్ ముప్పు ఉంటుందని చెప్పారు.
కాగా జనాభాలో 2 నుంచి 3 శాతం మందికి ఇలా రెండు కాపీల ఏపీవోఈ-4 జన్యువు ఉంటుంది.
‘నటనకు విరామం ఇస్తున్నానంటే దానర్థం పూర్తిగా వైదొలగుతున్నట్లు కాదు. తాత్కాలికంగా విరామం ఇస్తున్నాను అంతే’ అని హెమ్స్‌వర్త్ చెప్పారు.
‘అల్జీమర్స్ నివారణ చర్యలు పాటించడం వల్ల ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది’ అన్నారు హెమ్స్‌వర్త్.
నిద్ర, ఒత్తిడిలను మేనేజ్ చేయడం.. పోషకాహారం, ఫిట్‌నెస్, శరీర కదలికలు వంటివన్నీ ఈ చర్యలలోకి వస్తాయి. ఇవన్నీ స్థిరంగా ఒక క్రమపద్ధతిలో చేసుకుంటూపోవాలి’ అన్నారాయన.
తనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు ఇంకా నిర్ధరణ కాలేదని, ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలిందని చెప్పారు.
‘‘ఏపీవోఈ-4 జన్యువులు ఉన్నాయంటే అల్జీమర్స్ వస్తుందని కాదు... వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం’ అని చెప్పారు హెమ్స్‌వర్త్.
లిమిట్‌లెస్ సిరీస్ కోసం తన జన్యుపరీక్షల ఫలితాలన్నీ కెమేరా ముందు వెల్లడించాలని తొలుత అనుకున్నారు. అయితే, కానీ ఈ సిరీస్ క్రియేటర్ డారెన్ ఆరోనోవ్‌స్కీ మాత్రం జన్యు పరీక్షల ఫలితాలు తెలిసన తరువాత హెమ్స్‌వర్త్‌కు వ్యక్తిగతంగా తెలిపారు.
షోలో అల్జీమర్స్‌కు సంబంధించి ఉంచాలో వద్దో హెమ్స్‌వర్త్ ఇష్టానికే విడిచిపెట్టారు. కానీ, ప్రజల్లో చైతన్యం, అవగాహన కలిగించే లక్ష్యంతో హెమ్స్‌వర్త్ ఈ విషయాన్ని వెల్లడించాలనే నిర్ణయించారు.
హెమ్స్‌వర్త్ వేనిటీ ఫెయిర్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. తన తాతకు కూడా అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు చెప్పారు.
హెమ్స్‌వర్త్ శరీరానికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ఆ తరవాత ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి గల అవకాశాలను ఆయన తెలుసుకోవడం వంటివన్నీ లిమిట్‌లెస్ సిరీస్‌లో చూపిస్తారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేడుకలో దర్శకుడు రాజమౌళి... గవర్నర్స్ అవార్డ్స్ అంటే ఏంటి... ఎందుకిస్తారు
- నెలలు నిండకుండా పుట్టే శిశువులను కాపాడేందుకు ఇంక్యుబేటర్ కంటే తల్లి స్పర్శే బెటరా
- రవీంద్రనాథ్ ఠాగూర్ 1930లో జర్మనీకి గిఫ్ట్‌గా ఇచ్చిన పెయింటింగ్స్‌ను హిట్లర్ ఎందుకు ధ్వంసం చేశారు
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
- హనీ ట్రాప్ అంటే ఏంటి... సెక్స్‌ను ఒక ఆయుధంగా ఎలా వాడతారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)