వయనాడ్‌లో విధ్వంసం.. డ్రోన్ వీడియో

వీడియో క్యాప్షన్, కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి, చూరల్మలైల సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
వయనాడ్‌లో విధ్వంసం.. డ్రోన్ వీడియో

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 150 దాటింది. భారీ వర్షాల కారణంగా మెప్పాడి, చూరల్మలై, ముండక్కే, అట్టామలై తదితర ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.

ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు సహా అనేక భవనాలు మట్టిలో కూరుకుపోయాయి.

ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్, స్థానికులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మట్టిలో కూరుకుపోయిన వారి కోసం తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

వయనాడ్ కొండచరియల ప్రమాదం