డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులు, అక్కడ ఏం జరిగిందంటే..

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులు, అసలేం జరిగిందంటే..
డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులు, అక్కడ ఏం జరిగిందంటే..

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.

ఆయన క్షేమంగానే ఉన్నారని రిపబ్లికన్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ట్రంప్ తన నివాసానికి వెళ్లారు.

Donald trump

ఫొటో సోర్స్, Reuters

డోనల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిపిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు.

సభకు హాజరైన వారిలో ఓ వ్యక్తి దుండగుడి కాల్పుల్లో మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ తెలిపింది.

ట్రంప్‌పై కాల్పులను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాల నేతలు ఖండించారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)