ఆనంద్ మహీంద్రా ప్రశంసలు అందుకున్న 6 సీట్ల ఎలక్ట్రిక్ సైకిల్‌ను చూశారా..
ఇది 6 సీట్ల ఎలక్ట్రిక్ సైకిల్. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్ యువకుడు అసద్ అబ్దుల్లా దీన్ని తయారు చేశారు.
ఈ జుగాడ్ ఎలక్ట్రిక్ బైక్ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ప్రశంసలు అందుకుంది.

‘‘నేను ఈ ఆరు సీట్ల ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాను. దీనిపై ఒకేసారి ఆరుగురు కూర్చుని వెళ్లొచ్చు. చాలా దూరం వెళ్లొచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్లొచ్చు. పెట్రోల్ ధర రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే చౌకగా ఉండేలా, అందరూ వాడుకునేలా ఏదైనా తయారు చేయాలని అనుకున్నాం’’అని అసద్ అబ్దుల్లా చెప్పారు.
‘‘మాది రైతు కుటుంబం. పెట్రోల్ కొనాలంటే మాకు కష్టం. అందుకే దీన్ని తయారు చేశా. దీన్ని తయారు చేయడానికి నాకు 10 నుంచి 12 వేల రూపాయలు ఖర్చయింది. పాత సామాన్లలో వచ్చిన వస్తువులను నేను ఉపయోగించాను’’అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- భార్యను కీలు బొమ్మగా మార్చేసే ఈ గ్యాస్‌లైటింగ్ ఏమిటి, దీన్ని మొదట్లోనే గుర్తించడం ఎలా?
- ఎలాన్ మస్క్: ట్విటర్ ఆఫీస్‌ను ‘హోటల్’గా మార్చిన కొత్త బాస్
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహించింది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



