ఆఫ్రికా నుంచి 'బానిసలుగా' భారత్‌కు వచ్చిన సిద్ధి కమ్యూనిటీకి చెందిన ఈ అమ్మాయిలు క్రీడాకారిణులుగా గుర్తింపు పొందుతున్నారు - ISWOTY
భారత్‌లో ఒంటరిగా బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఆఫ్రికా సంతతికి చెందిన సమాజమే సిద్ధి కమ్యూనిటీ. ఆఫ్రికా నుంచి బానిసలుగా భారత్‌కు వచ్చింది సిద్ధి కమ్యూనిటీ. ఈ వర్గానికి చెందిన కొందరు ఇప్పుడు క్రీడల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
గుజరాత్‌కు చెందిన షాహిన్ దర్జాదా జూడో చాంపియన్. 2025 సెప్టెంబరులో దేశం, తన కమ్యూనిటీ గర్వించేలా ఆమె చరిత్ర సృష్టించారు.
ఇండోనేషియాలో జరిగిన ఆసియా జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు. 57 కేజీల కేటగిరీలో ఆమె ఈ పతకం సాధించి పెరూలో జరిగే వరల్డ్ జూనియర్స్ జూడో చాంపియన్ షిప్‌కు అర్హత సాధించారు. క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









