హైదరాబాద్ - నీరా కేఫ్: తాటిచెట్టు నుంచి నీరాను ఉదయాన్నే ఎందుకు తీస్తారు?

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ - నీరా కేఫ్: తాటిచెట్టు నుంచి నీరాను ఉదయాన్నే ఎందుకు తీస్తారు?
హైదరాబాద్ - నీరా కేఫ్: తాటిచెట్టు నుంచి నీరాను ఉదయాన్నే ఎందుకు తీస్తారు?

పల్లెల్లో తాటి చెట్ల కింద కూర్చుని కల్లు తాగిన అనుభవం చాలా మందికి ఉండవచ్చు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున అలాంటి అనుభూతి పొందాలంటే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న నీరా కేఫ్‌కు రావాల్సిందే.

అయితే ఇక్కడ దొరికేది కల్లు కాదండోయ్! ఇది నీరా! తాటి, ఈత చెట్ల నుంచి తీసిన స్వచ్ఛమైన నీరా అమ్ముతారిక్కడ. నీరా అంటే చూడ్డానికి కల్లులానే ఉంటుంది కానీ, ఈ రెండూ ఒకటి కాదు!

నీరా కేఫ్

ఫొటో సోర్స్, Getty Images

సాధారణంగా ఈత, తాటి, ఖర్జూర వంటి చెట్ల నుంచి కల్లు తీస్తారు. నీరా కూడా అవే చెట్ల నుంచి తీస్తారు కానీ దానివల్ల మత్తు రాదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే నీరా పులిస్తే కల్లు అవుతుంది. పులియనివ్వకపోతే నీరాగా ఉంటుంది.

వాస్తవానికి తాటి చెట్ల నుంచి ముందుగా వచ్చేది నీరాయే. కల్లు కాదు. తీసే విధానం వల్ల ఆ నీరా కల్లుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)