You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సురాన్‌కోట్: తాత్కాలిక బాంబు షెల్టర్‌లో ఒక రాత్రి ఎలా గడిచిందంటే...
- రచయిత, డెబాలిన్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఉన్న సురాన్‌కోట్‌లో తొలిసారిగా షెల్లింగ్, ఫిరంగి కాల్పుల ఘటనలు జరిగాయని స్థానికులు చెప్పారు. సరిహద్దు ప్రాంతాలలో దీన్ని చాలా సురక్షితమైన పట్టణంగా భావిస్తారు, ప్రజలు అక్కడికి సేఫ్టీ కోసం వెళ్తుంటారు.
పూంఛ్ జిల్లా నియంత్రణ రేఖకు దగ్గరగా ఉంటుంది. నేను, నా సహోద్యోగి రాఘవేంద్ర, నేను అక్కడ ఉన్నప్పుడు రాత్రంతా భారీ షెల్లింగ్ జరిగింది.
ఆ రాత్రి సురక్షితంగా ఉండటానికి నియంత్రణ రేఖ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సురాన్‌కోట్ పట్టణానికి మేం వచ్చాం.
రాత్రి 11 గంటల ప్రాంతంలో మా కథనాలను పంపిన తర్వాత, నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా, మా హోటల్ సిటీ ప్యాలెస్ దగ్గర ఒక షెల్ పడింది. మాది 10 గదులున్న ఒక చిన్న చెక్క డబుల్ ఫ్లోర్.
పెద్ద శబ్దం వినగానే మాతో పాటు ఇతర గెస్టులు గదుల నుంచి బయటకు పరిగెత్తాం. ఇంతకుముందు ఇలా జరిగిందా? పేలుళ్ల నుంచి దాక్కోవడానికి సురక్షితమైన స్థలం ఉందా? అని మేం హోటల్ మేనేజర్‌ను అడిగాం.
హోటల్ యజమాని వసీం తల అడ్డంగా ఊపారు. సురాన్‌కోట్‌లో కాల్పులు జరగడం ఇదే మొదటిసారని మాకు చెప్పారు.
ఆయన మమ్మల్నందరినీ హోటల్ బేస్‌మెంట్‌కు తీసుకెళ్లారు. ఇది మూడు వైపుల నుంచి రక్షణగా ఉండటంతో కాస్త సేఫ్ అనిపించింది.
మొదటి 30 నిమిషాలు గందరగోళంగా గడిచింది. సమీపంలోనే మరో పేలుడు సంభవించింది. మేం బేస్‌మెంట్‌లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుండగా భవనం కిటికీలు ధ్వంసమయ్యాయి.
అక్కడ ఆరుగురు పిల్లలతో సహా దాదాపు 25 మందిమి ఉన్నాం. మరికొన్ని గంటల పాటు 10-15 నిమిషాల విరామాల్లో షెల్లింగ్, ఫిరంగి కాల్పులు కొనసాగాయి.
ఉదయం 5 గంటల ప్రాంతంలో బేస్‌మెంట్ నుంచి మా గదులకు వెళ్లాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)